Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూటమి నేతలకు చంద్రబాబు బిగ్ అలర్ట్..!!

కూటమిలోని మూడు పార్టీల నేతలను సీఎం చంద్రబాబు అలర్ట్ చేసారు. సమన్వయంగా వ్యవహ రించాలని సూచించారు. ఎవరూ అతి విశ్వాసానికి పోవద్దని హెచ్చరించారు. మూడు పార్టీల నేతలు కలిసి పని చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని గెలిపించాలని నిర్దేశించారు. ఏడు నెలల కాలంలో తీసుకొచ్చిన మార్పు గురించి వివరించాలని చెప్పారు. ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులే గెలవాలని స్పష్టం చేసారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ముందస్తుగానే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసారు. ఇప్పటికే ఓటర్ల నమోదు తో పాటుగా స్థానిక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం ప్రారంభించారు. కాగా, తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో, కూటమిలోని మూడు పార్టీల నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించి వారిని అప్రమత్తం చేసారు. ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు.

CM Chandra Babu key directions for NDA parties leaders over coordination in MLC Elections

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గోదావరి జిల్లాల నుంచి.. అదే విధంగా క్రిష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూటమి అభ్యర్ధులుగా బలపరిచామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్.. 27న ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసారు. ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి మద్దతు కోరాలని కూటమి నేతలు స్పష్టం చేసా రు. చదువుకున్న వాళ్లంతా కూటమికే మద్దతుగా నిలుస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని ముఖ్యమం త్రి చంద్రబాబు సూచించారు.

ఎన్డీయే పక్షాల నేతలు సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలని చంద్రబాబు పేర్కొ న్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్‌చార్జ్‌లతో పాటు గా.. జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల్లో సానుకూల వాతావరణం ఉందని.. ఈ సమయంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్దులు భారీ మెజార్టీ సాధించటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రతి ఓటరునూ పార్టీ శ్రేణు లు నేరుగా కలవాలని, సోషల్‌ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+