టీడీపీలో కొత్త జిల్లా అధ్యక్షులు ఖరారు, కీలక మార్పులు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్దం అయ్యారు. సుదీర్ఘ కసరత్తు తరువాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షుల ఖరారు పైన నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా పార్టీలో సీనియార్టీ - విధేయతకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక జరిగింది. అదే విధంగా పార్టీ పదవుల్లోనూ కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలు స్తోంది. త్వరలోనే పార్టీ పదవులపై చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు.
టీడీపీలో కీలక నియామకాల కసరత్తు దాదాపు పూర్తయింది. సిద్ధం చేసిన జాబితా ప్రకారం పార్ల మెంటరీ పార్టీ అధ్యక్షుల్లో సీనియర్లతో పాటు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం కల్పించారు. సుమారు 10 మంది సీనియర్లకు అవకాశం దక్కింది. తిరుపతి జిల్లా: పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా: షణ్ముగం, అన్నమయ్య జిల్లా: సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లా: ఉగ్ర నరసింహారెడ్డి, అనంతపురం జిల్లా: కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా: ఎంఎస్ రాజు, నంద్యాల జిల్లా: ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా: కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా: బడేటి చంటి, కాకినాడ జిల్లా: జోత్యుల నవీన్, బాపట్ల జిల్లా: సలగల రాజశేఖర్, పల్నాడు జిల్లా: కొమ్మాలపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా: పిల్లి మాణిక్యాలరావు, ఎన్టీఆర్ జిల్లా: గద్దె అనురాధ, కృష్ణా జిల్లా: వీరంకి గురుమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా: రామరాజు, తూర్పుగోదావరి జిల్లా: వెంకటరమణచౌదరి.

అదే విధంగా కోనసీమ జిల్లా: గుత్తుల సాయి, విశాఖ జిల్లా: చోడే పట్టాభిరామ్, అనకాపల్లి జిల్లా: బత్తుల తాతబ్బాయ్, కర్నూలు జిల్లా: వహీద్, నెల్లూరు జిల్లా: బీదా రవిచంద్ర, కడప జిల్లా: భూపేశ్ రెడ్డి ఉన్నారు. ఈ జాబితాలో పదిమంది ఓసీలు, 9మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి అవకాశం లభించనుంది. ఓసీల్లో నలుగురు కమ్మ, ముగ్గురు కాపులు, ఇద్దరు రెడ్లు, ఒక రాజు ఉన్నారు. పిల్లి మాణిక్యాలరావు (లిడ్‌క్యాప్ చైర్మన్), వీరంకి గురుమూర్తి (గౌడ కార్పొరేషన్ చైర్మన్,), కోట్ని బాలాజీ (డీసీఎంస్ చైర్మన్), బొడ్డు వెంకట రమణ చౌదరి (రాజమండ్రి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్), మంతెన రామరాజు (ఏపీఐఐసీ చైర్మన్), సలగల రాజశేఖర్ (బాపట్ల అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్), మన్నే సుబ్బారెడ్డి (విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్) నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు.
రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్న సుగవాసి ప్రసాద్ తొలినుంచీ టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన సోదరుడు సుగవాసి సుబ్రహ్మణ్యానికి 2024లో రాజంపేట ఎమ్మెల్యేగా టీడీపీ అవకాశం ఇచ్చింది. ఆయన ఓటమి పాలై ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రసాద్ మాత్రం పదవులతో సంబంధం లేకుండా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. సీనియార్టీ, విధేయత, సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో ఆయన్ను పదవి వరించింది. కడప పార్లమెంటు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్న భూపేశ్ సుబ్బరామిరెడ్డి.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. మంతెన రామరాజు ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. రఘురామరాజు కోసం సీటు త్యాగం చేశారు. ఈ నియామకాల పైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications