వారిని భరించాల్సిన అవసరం లేదు - తేల్చేసిన చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. ప్రభుత్వం - పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణ నిర్దేశిస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ పై ఖరా ఖండిగా తేల్చి చెబుతున్నారు. వరస జిల్లా సమీక్షల్లో భాగంగా క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన అందిన నివేదికల ఆధారంగా యాక్షన్ ప్లాన్ అధికారులు - నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ - ప్రభుత్వంలో ఎవరైనా సమస్యలకు కారణంగా ఉంటే వారిని భరించాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం.. పార్టీ పరంగా కీలక నిర్ణయాలతో సిద్దం అవుతన్నారు. వరుసగా పలు జిల్లాల అధికారులు- మంత్రులు, నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానం పొలిటికల్ గవర్నెన్స్ అని తేల్చి చెబుతున్నారు. ఈ సమీక్షల్లో ప్రధానంగా ఇప్పటికే ఆరు రకాలుగా సేకరించిన క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ స్థితిగతులు, అధికారుల పనితీరు, జిల్లాలో పరిస్థితులపై నివేదికల ఆధారంగా సీఎం సమీక్షిస్తున్నారు. మండల స్థాయి సమస్యలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్​లో ఉన్న నిర్మాణాలు, రోడ్లు, మున్సిపాలిటీల్లో లెగసీ సమస్యలు వంటి వాటిపై చర్చ, పరిష్కారం దిశగా మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఎన్ని సార్లు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారనే వివరాలతో సహా పూర్తి సమాచారంతో... వారికి రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలా పైన స్పష్టత ఇస్తున్నారు.

cm-chandra-babu-made-clear-directions-for-ministers-officials-over-political-governance-in-district

పొలిటికల్ గవర్నెన్స్ పై స్పష్టత

ఈ సమీక్షల్లో ఎమ్మెల్యేల పనితీరే కాకుండా వివిధ విభాగాల్లో జిల్లాల్లో అధికారుల పనితీరుపైనా నివేదికల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి సమాచారం తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు ఇప్పటికే తెలిపారు. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకులు నడుచుకోవాలని సూచించారు. పొలిటికల్‌ గవర్నెన్స్‌ అనేది కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. కార్యకర్తలను పట్టించుకోకుండా, ప్రజల్లో ఉండకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అందరూ కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కొన్ని చోట్ల అనర్హులకు పింఛన్లు అందుతున్నాయి, అర్హులకు ఎట్టిపరిస్థితుల్లో నూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+