అమరావతిలో అరుదైన ఘట్టం - తిరుమల తరహాలో..!!
అమరావతిలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. తిరుమల తరహాలోనే రాజధానిలో శ్రీవారి ఆలయం తీర్చి దిద్దేందుకు కీలక అడుగు పడింది. వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఇక్కడ తిరుమలలో ఉన్న విధంగానే ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.
అమరావతిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తరహాలో తీర్చి దిద్దుతున్నారు. అందు లో భాగంగా ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేసారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.140 కోట్లతో అభి వృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్‌రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మంది రం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

కాగా, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. భూమి పూజ వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారన్నారు. నాడు తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం చేపట్టానని చెప్పారు. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక.. వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించేలా పర్యవేక్షణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications