చంద్రబాబు "నిఘా" లో అడ్డంగా దొరికేసిన ఎమ్మెల్యేలు - లిస్టులో..!!
సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల అడ్డంగా దొరికేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా వినకుండా మద్యం..ఇసుక టెండర్లలో ఇష్టారాజ్యం వ్యవహరించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నిఘా తో ఆధారాలతో చిక్కారు. మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి పైన చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేకంగా పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీకి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వారి విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటి.
ఎమ్మెల్యేలపై ఆరోపణలు
రాష్ట్రంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక వ్యాపారాల్లో మితి మీరి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వారికి హెచ్చరికలు చేసారు. ఎవరైనా మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారు. వారిని కట్టడి చేయాలంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీ ఏర్పాటు చేసారు. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితా చంద్రబాబు సిద్దం చేసుకున్నారు. 18 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సీరియస్
ఎమ్మెల్యేల భేటీ తరువాత వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారిలో చిత్తూరు, ఉభయ గోదావరి తో గుంటూరు, ప్రకాశం కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. అక్రమ, అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు వారి కుటుంబసభ్యులూ ఎక్కడా తల దూర్చడానికి వీల్లేదని గట్టిగా చెప్పనున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను మాత్రం విడి విడిగా ఒక్కొక్కళ్లను పిలిపించి మాట్లాడనున్నారు. ఇప్పటికే వైసీపీ మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తోంది. మద్యం టెండర్ల విషయంలో నూ సొంత పార్టీ నేతలు హెచ్చరించిన మారకపోవటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
ఫైనల్ వార్నింగ్
దాదాపు 18 ఎమ్మెల్యేల ప్రవర్తన విసిగిస్తోందని చంద్రబాబు సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. వీరి విషయంలో మాత్రం చంద్రబాబు కఠినంగానే వ్యవహరించటం ఖాయంగా కనిపిస్తోంది.రి వ్యవహారశైలి క్యాడర్‌కు అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని అలాగే వదిలేస్తే 2014-19మధ్య జరిగిన తప్పిదమే పునరావృతమవుతుందని పలువురు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, పార్టీలో ఇప్పుడు ఈ 18 మంది లిస్టులో ఉన్న వారి పేర్ల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. విడిగా పిలిచే జాబితాలో తమ పేరుందేమో అని ఉత్కంఠ కొందరు నేతల్లో నెలకొంది. దీంతో, 18న చంద్రబాబు నిర్వహించే సమావేశంలో నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications