ఉచిత గ్యాస్ సిలిండర్ ల పథకంపై దీపావళి వేళ సీఎం చంద్రబాబు చెప్పిందిదే
దీపావళి పండుగను విశేషంగా జరుపుకునే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తోలి దీపావళి పండుగకు చంద్రబాబు సర్కార్ ప్రజలకు కానుక అందించింది. ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇచ్చే దీపం 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది.
దీపావళి పండుగ విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు
ఇక ఈ క్రమంలో తాజాగా దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్స్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తన ట్వీట్ లో ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు అని పేర్కొన్న చంద్రబాబు నరకాసుర సుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది అన్నారు.

సూపర్ సిక్స్ హామీలలో ఒక హామీ అమలు చేస్తున్నామన్న చంద్రబాబు
ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా 'దీపం 2.0' పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక హామీ అమలు చేస్తున్నట్టు చెప్పారు.
'దీపం 2.0' పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు
తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే 'దీపం 2.0' పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇది సంతోషం కలిగించే విషయం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీ నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే స్ఫూర్తిని పొందుతున్నాము అని తెలిపారు.
ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని చంద్రబాబు ఆకాంక్ష
ఈ ఆనంద దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చంద్రబాబు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే దీపావళి కానుకగా తాము అందిస్తున్న దీపం 2.0 పథకం గురించి పేర్కొని మహిళలకు తాము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications