ఎన్నిరోజులు అయ్యింది ?, ఇంతకాలం ఏం చేశారు ?, సూటిగా అడిగిన చంద్రబాబు
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్నిప్రమాదం కేసు దర్యాప్తును ప్రత్యేక టీమ్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు కోసం పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరగడానికి, ఫైల్స్ కు మంటలు వ్యాపించడంలో వైసీసీ నాయకులు హస్తం ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు,వైసీపీ కార్యకర్తలు కలిసి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు తదితర నియోజక వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములు, సెక్షన్ 22 ఏ భూములు రికార్డులు చాలా వరకు ఖాళీ బూడిద అయ్యాయని అధికారులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి గౌతమ్ తేజను పోలీసులు విచారిస్తున్నారు.

ఆదివారం రోజు రాత్రి 11.23 గంటల సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పోలీసులపై సీరియస్ అయ్యారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన అగ్నిప్రమాదం జరగలేదని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. పెట్రోల్, డీజల్ కారణంగా మంటలు వ్యాపించలేదని, గౌతమ్ తేజ్ కావాలనే కారు ఇంజిన్ ఆయిల్ తీసుకు వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని బీరువాలో పెట్టాడని, ఇంజిన్ ఆయిల్ కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసు పై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత పోలీసు అధికారులను ప్రశ్నించారని తెలిసింది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావును ప్రథమిక విచారణ నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని సమాచారం. ఇప్పటికే ప్రత్యేక టీమ్ పోలీసులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
మాధవ రెడ్డి ఢిల్లీలో తలదాచుకున్నాడని అనుమానం రావడంతో అక్కడికి ఓ టీమ్ పోలీసులు వెళ్లారని తెలిసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్ని ప్రమాదం కేసు త్వరలో చేధిస్తామని ప్రత్యేక టీమ్ పోలీసులు అంటున్నారు. సీఐడీ అధికారులు కూడా పలు కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తుండటంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లు తప్పించుకోవడం సాధ్యం కాదని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.
-
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications