సీఎం చంద్రబాబు స్కెచ్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, జగన్, పెద్దిరెడ్డికి అలా చెక్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత తెరమీదకు తెచ్చారు. హంద్రీ నీవా పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చెక్ పెట్టడానికి ప్లాన్ చేశారు. పుంగనూరుకు కూడా హంద్రీ నీవా నీరు అందించడానికి యుద్దప్రాతీపదికన పనులు చెయ్యాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పడమటి మండలాలకు సాగునీరు అందించడానికి హంద్రీ నీవా పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికి హంద్రీనీవా పథకం పూర్తి చెయ్యాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గడువు విధించారు. అయితే ఆ తర్వాత వైఎస్. రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. తరువాత అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 2013 నాటికి హంద్రీ నీవా పథకం పూర్తి చేస్తామని ప్రకటించారు.

రూ. 1,592 కోట్లతో ప్రారంభించిన హంద్రీ నీవా పథకం తీవ్ర జాప్యం జరగడంతో వ్యయం తడిచి ముద్ద అయ్యి రూ. 2,906.41 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు హంద్రీ నీవా పథ్ం పనులు దాదాపు పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లు పారించారు. అయితే ఆ తరువాత వైఎస్ జగన్ హయాంలో హంద్రీ నీవా పథకం పనులు అంతంతమాత్రంగానే జరిగాయి.
చిత్తూరు జిల్లాలోని పడమటి మండాలకు నీళ్లు అందించడానికి పుంగనూరు బ్రాంచి కాల్వకు అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ సమీపంలోని బొంతలపల్లె దగ్గర ప్రారంభం అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో హంద్రీ నీవా పథకం పనులు అంతమంత్రం జరగడంతో కాలువలో కంపచెట్లు పెరిగిపోయాయని, పలు చోట్ల కట్టలు బలహీనం అయిపోయాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీ నీవా పథకం పనుల గురించి సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చెయ్యాలని, కాలువ మరమత్తుల పనులు వేగవంతం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ నీవా పథకం కింద నీరు వస్తుంది. ఇదే సమయంలో వరుసగా పుంగనూరు నుంచి ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆ ప్రాంతానికి హంద్రీ నీవా పథనం కింద సాగునీరు అందించడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు.
తమ హయాంలోనే పుంగనూరు ప్రాంతానికి హంద్రీ నీవా పథకం కింద నీరు అందించి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని రాజకీయంగా దెబ్బ తియ్యాలని చంద్రబాబు ప్లాన్ చేశారని తెలిసింది. మొత్తం మీద హంద్రీ నీవా పథకం పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అని సీఎం చంద్రబాబు బావించారని తెలిసింది. త్వరలో హంద్రీ నీవా పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications