చంద్రబాబు మార్క్ నిర్ణయాలు - భారీ మార్పులు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చి పది నెల లు పూర్తవుతున్న వేళ పాలనా పరంగా మార్పులకు సిద్దం అవుతోంది. ఉగాది నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి వేదికగా పీ4 కార్యక్రమం ప్రారంభించనున్నారు. పాలనా పరంగా కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందు కోసం పాలనా వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలకు రంగం సిద్దం చేస్తున్నారు. కేబినెట్ లో నాగబాబు ఎంట్రీతో పాటుగా.. అధికార యంత్రాంగంలోనూ కొత్త నిర్ణయాలకు సర్వం సిద్దమైంది. దీంతో, చంద్రబాబు తాజా నిర్ణయాల పై ఆసక్తి నెలకొంది.

కలెక్టర్ల సదస్సు
ఏపీ ప్రభుత్వం పాలన పరంగా కీలక నిర్ణయాలకు సిద్దమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో మార్పులు తెస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా పాలనా పరమైన సంస్కరణలతో అభివృద్ధి - సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ నెల 25,26 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సు ఇందుకు వేదిక కానుంది. ప్రభుత్వ పాలన గ్రామీణ స్థాయి వరకు సమర్ధవం తంగా తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా అధికార యాంత్రాంగానికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే నివేదికలు సిద్ధం అయ్యాయి.

cm-chandrababu-will-unveil-the-govts-development-agenda-at-collectors-conference-to-be-held-on-25

భారీ ప్రక్షాళన
ఈ సదస్సులో ప్రధానంగా ఉగాది నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న పీ4 కార్యక్రమం పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. అదే విధంగా పేదలందరికీ ఇళ్లు పైనా స్పష్టత ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాలను మే నెల నుంచి అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అర్హతే ప్రామాణి కంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. పది నెలల కాలంలో ప్రభుత్వ పాలన.. గతం లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పైనా సమీక్ష చేయనున్నారు. అదే విధంగా పాలనలో కీలకమైన శాంతి భద్రతల విషయంలోనూ చంద్రబాబు మరోసారి స్పష్టత ఇవ్వనున్నారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఇప్పటికే పోలీసు అధికారులకు తేల్చి చెప్పారు. మహిళల పై అఘాయిత్యాలు, గంజాయి - డ్రగ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ సదస్సులో జిల్లాల వారీగా సమీక్ష చేస్తూనే.. కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.

Take a Poll

దిశా నిర్దేశం
ఇక, కలెక్టర్ ల సదస్సు తర్వాత పాలనలో భారీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు దృష్టి పెట్టబోతు నారు. కొన్ని శాఖలు ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్దమైంది. ఈ బదిలీలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. అదే విధంగా వచ్చే నెలలో నాగబాబు మంత్రిగా కేబినెట్ లోకి వచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మంత్రివర్గంలో కొత్తగా మరెవరికీ అవకాశం ఉండదని.. నాగబాబు చేరికకు మాత్రమే పరిమితం అవుతుందని చెబుతున్నారు. అయితే, శాఖల్లో మాత్రం మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక.. పొలిటికల్ గవర్నెన్స్ అని చెబుతున్న సమయంలో ప్రజలతో మమేకం అవుతూ ప్రజా ప్రతినిధులు.. అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+