ఉమెన్స్ డే నాడు భార్య కోసం సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్.. ఏం కొన్నారు? ఎంతకి కొన్నారంటే?
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు. ఈ క్రమంలోనే ఓ చీరల స్టాల్ ను కూడా సీఎం సందర్శించారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఆయన భార్య భువనేశ్వరి కోసం ఓ పట్టుచీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగానే చీర రూ.26,400 అని చెప్పగా.. రూ.25 వేలకు బేరం ఆడి కొనుగోలు చేశారు.
అంతే కాకుండా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అలానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు చంద్రబాబు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు. అంతే కాకుండా మహిళా రైడర్లను కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో మహిళా డ్రైవర్లను అభినందించారు. ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.
చేనేత మహిళలకు, చేనేత రథం అందించి, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా, ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఒక్క వ్యాన్ ఖరీదు రూ.60లక్షలు. దాని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం మరింత సులభం అవుతుంది. #KutamiStandsForWomen#WomensDay… pic.twitter.com/E8DEKqnDJG
— Telugu Desam Party (@JaiTDP) March 8, 2025
ఇక ప్రతిఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ఏడాదిలో లక్షమంది పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహిళలు శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని అన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. మహిళల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications