పథకాలు అందని వారికి జగన్ శుభవార్త - నేరుగా ఖాతాల్లోకి నిధులు..!!
ముఖ్యమంత్రి జగన్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో 89 శాతం మందికి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రెండు నెలల కాలంలో కీలక పథకాల అమలుకు నిర్ణయించారు. ఇదే సమయంలో కొత్త పథకాల ప్రకటన పైనా కసరత్తు జరుగుతోంది. అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. నేరుగా వారి ఖాతాల్లోకి నిధులు విడుదల చేసారు.
అర్హత ఉన్న అందరికీ లబ్ది: ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తున్నారు. వారికి కూడా పథకాలు అమలు చేయటం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని చెప్పుకొచ్చారు.

త ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఏదైనా కారణం చేత పథకాలు అందకపోతే ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. 2021 డిసెంబర్‌లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అమలు చేస్తున్నామని వివరించారు.
అర్హత ఉంటే మరో ఛాన్స్: ఏ కారణం చేతనైనా పొరపాటున ఒక పథకం అందకపోతే..వాళ్లకు మళ్లీ గుర్తు పెట్టుకొని ఒక నెలలోపు సమయం ఇచ్చి వాళ్ల చేత దరఖాస్తు చేయించి, ఆ దరఖాస్తును వెరిఫై చేయిస్తూ మళ్లీ ఆ లబ్ధిదారుడికి మేలు చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేసారు. ప్రతి ఏటా జూన్, జులై, డిసెంబర్, జనవరిలో మరోసారి రెండుసార్లు పథకాలు అందని వారికి అవకాశం కల్పిస్తూ మరోఛాన్స్ ఇస్తూ మంచి చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
2021 డిసెంబర్‌లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఐదోవసారిగా చెప్పారు. వివిధ పథకాలకు సంబంధించి 68 వేల మందికి రూ.98 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసారు. అమ్మఒడి ద్వారా 40,616 మందికి మిస్ అయిందని...వారికి డబ్బులు ఇస్తున్నామని వివరించారు.

ఖాతాల్లొ నిధుల జమ: ఈబీసీ నేస్తం ద్వారా 4180 మందికి, వైయస్‌ఆర్ వాహనమిత్ర ద్వారా 3030 మందికి ఈ రోజు నిధులు జమ చేసారు. మత్స్యకారభరోసా ద్వారా మరో 2 వేల మందికి, కళ్యాణమస్తు ద్వారా ఇప్పుడు 1912 మందికి నిధులు విడుదల చేసారు. వైయస్‌ఆర్ కాపునేస్తం ద్వారా 1884 మందికి, నేతన్న నేస్తం ద్వారా ఇప్పుడు 352 మందికి కొత్తగా 1,17,101 మందికి పింఛన్లు మంజూరు చేశారు.
కొత్తగా బియ్యం కార్డులు 1,01,300 మందికి ఇస్తున్నామన్నారు. 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా వివక్ష, లంచం అనే పదానికి తావు లేకుండా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications