ఎంపీలుగా బరిలో పేర్ని నాని, చెవిరెడ్డి - వైసీపీ జాబితా సిద్దం..!!
వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. సీఎం జగన్ ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఖరారు చేసారు. సిట్టింగ్ ల స్థానాల్లో మార్పులు చేసారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మరి కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగానూ పోటీకి దించుతున్నారు. ఇక, తాజా జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తుది కసరత్తు : ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దుల కసరత్తు త్వరలో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖ, ఏలూరు, విజయవాడ, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, తిరుపతి వంటి స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసారు. ఇక, పెండింగ్ స్థానాల్లో అనకాపల్లి నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ లేదా పీలా రమాకుమారి పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయి. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్ పేరు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అక్కడ సిట్టింగ్ ఎంపీ భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయనున్నారు.

అభ్యర్దుల ఖరారు : ఏలూరు స్థానం బీసీలకు ప్రకటించారు. కాగా, అనూహ్యంగా నర్సాపురం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన వారికి సీటు కేటాయించాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుులో భాగంగా గుబ్బల తమ్మయ్య పేరు ప్రచారంలో ఉంది. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని బరిలోకి దిగే అవకావం కనిపిస్తోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే స్థానం నాని కుమారుడుకు ఇవ్వటంతో ఆయన ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని సమాచారం. నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ పేరు దాదాపు ఖాయమైంది. ఒంగోలు స్థానం నుంచి అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని బరిలోకి దింపే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరి సీటు ఎక్కడ : గుంటూరు నుంచి కమ్మ వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కర్నూలు నుంచి మేయర్ రామయ్య పేరు దాదాపు ఖరారైంది. నంద్యాల నుంచి మైనార్టీకి ఇవ్వాలనేది సీఎం జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే సినీ నటుడు ఆలీ పేరు ప్రచారంలో ఉంది. కడప నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఖాయమని చెబుతున్నా...కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీకి దిగే అవకాశం ఉందనేది పరిగణలోకి తీసుకొని అభ్యర్దిని ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. అదే విధంగా రాజంపేట నుంచి తిరిగి మిథున్ రెడ్డి పోటీ చేయటం ఖాయమైంది. ఈ రోజు లేదా రేపు ఎంపీలకు సంబంధించిన తుది జాబితా విడుదల చేయాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications