CM Jagan: పొత్తులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు - అప్పుడే నాకు ఓటు వేయండి..!!
CM Jagan on Oppostion Parties: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు...పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిపివేయటానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం శ్రీలంక అవుతుదంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బటన్ నొక్కి పేదలకు మంచి చేస్తే వీళ్లకు పుట్టగతులు ఉండవనే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యకత్ం చేసారు. మదనపల్లిలో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని సూచించారు. ఇదే సమయంలో పొత్తులకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేసారు.
నేను నమ్ముకున్నది ఇద్దరినే..
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో పొత్తుల గురించి వివరించారు. గత పాలనలో చంద్రబాబు చిన్న పిల్లల నుంచి మహిళలు..రైతులను మోసం చేసారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు రైతు సంక్షేమం.. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాంటూ ఎద్దేవా చేసారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను కుల్లిపోయిన పెత్తందారి మనస్తత్వాలు ఉన్న చంద్రబాబు..ఆయనకు మద్దతుగా నిలుస్తున్న దత్తపుత్రుడుతో పాటుగా మద్దతు మీడియా పైన పోరాటం చేస్తున్నామన్నారు.
తాను రాక్షసులతో పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో ఏ మేలు చేయని చంద్రబాబు..ఇప్పుడు చెబుతున్న మాటలు విని ప్రజలంతా ఇదేమీ ఖర్మరా బాబు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన పొత్తు ప్రజలతోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను దేవుడిని..ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని స్పష్టం చేసారు. మంచి జరిగింది అనుకుంటే తనకు మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. చంద్రబాబు..దత్తపుత్రుడు మద్దతు మీడియా చేస్తున్న ప్రచారం నమ్మవద్దని సూచించారు.
నేటికి పాలనలో ఆ భాగం పూర్తయింది
ముఖ్యమంత్రిగా తాను పాలన పగ్గాలు చేపట్టి మూడున్నారేళ్లు పూర్తయిందని జగన్ వివరించారు. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. పేదలకు చదువును హక్కుగా మార్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించామన్నారు. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించామన్నారు.
మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా... మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు. తీర్చింది. ఈ మూడున్నరేళ్ల పాలనలో ఈ రెండు పథకాలకు అక్షరాల రూ.12401 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని చెప్పారు. సీబీఎస్‌ఈ తీసుకువచ్చామన్నారు. బడుల రూపురేఖలు మార్చుతున్నామని వివరించారు. చదివించే తల్లలులకు అండగా నిలుస్తూ..మీ పిల్లలను బడులకు పంపించండని ముఖ్యమంత్రి కోరారు.
రూ 55 వేల కోట్లు ఖర్చు చేసాం
ఈ మూడున్నారేళ్ల కాలంలో కేవలం విద్యారంగానికే రూ 55 వేల కోట్లు ఖర్చు చేసామని ముఖ్యమంత్రి చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ. 19617 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా రూ. 951 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ.3349 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా రూ. 2368 కోట్లు , 8వ తరగతి ట్యాబ్స్ ఇచ్చేందుకు అక్షరాల మరో రూ.685 కోట్లు ఈ డిసెంబర్‌లో ఖర్చు చేస్తున్నామన్నారు. ఫలాన ప్రాంతంలో, ఫలాన పొలాలను ఫలానా రేటుకు అమ్ముకునేందుకు , ఆ భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి వీళ్లందరూ కూడా బయట పడేలా వీరికి ఆ దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని పంచిపెట్టాలని దేవుడిని కోరుకునే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రభుత్వమే ఉండేది. ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు ఈ మాదిరిగా నేరుగా బటన్‌నొక్కి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల వచ్చేలా మంచి చేయలేకపోయారో ఆలోచన చేయాలని సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications