వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైరెడ్డి సిద్దార్ధ -మాస్ వైబ్రేషన్ : జగన్ చెప్పారు..ఇచ్చేసారు : శాప్ ఛైర్మన్ గా నియామకం..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. సిద్దార్ధ రెడ్డికి సీఎం జగన్ ఏ పదవి ఇస్తారు...కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే, నందికొట్కూరు ఎన్నికల ప్రచార సభలో జగన్ సిద్దార్ధ రెడ్డికి హామీ ఇచ్చారు. సిద్దార్ధను తన గుండెల్లో పెట్టి చూసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అదే అమలు చేసారు. బైరెడ్డి వయసు..అనుభవం కాకుండా.. ఆయన పని తీరునే ప్రామాణికంగా తీసుకున్నారు. బైరెడ్డికి ఉన్న అభిమానం గుర్తించారు.

 శాప్ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్ద రెడ్డి..

శాప్ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్ద రెడ్డి..

అంతే..ఆయనకు రాష్ట్ర స్థాయి ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. వివాదాస్పద నటి శ్రీరెడ్డి సైతం తనకు బైరెడ్డితో డేటింగ్ చేయాలని ఉందంటూ అప్పట్లో చేసిన కామెంట్లు హాట్ డిస్కషన్ కు కారణమయ్యాయి. ఇక, ఇప్పుడు సీఎం జగన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని నియమించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నుండి ఆర్దర్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అక్కడ ఇప్పుడు వైసీపీ ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేధాలు ఉన్నా..అధినాయకత్వం బైరెడ్డిని పక్కన పెట్టలేని పరిస్థితి.

 యాస-భాష-దూకుడు ఆయుధాలుగా..

యాస-భాష-దూకుడు ఆయుధాలుగా..


బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్..వాగ్దాటి.. యాస - భాష..ముఖ్యంగా యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ప్లస్ పాయింట్స్ గా మారాయి. రాజకీయంగా దూకుడుగా ఉండే బైరెడ్డికి బలం అదే..బలహీనత అదే. రాజకీయాల్లో నాకున్న ఒకే ఒక ధైర్యం జగన్ అని చెబుతూ..తన నియోజకవర్గం నేతలను- జిల్లా నాయకులను లెక్క చేయరనే విమర్శ ఉంది. ఇక, వైసీపీ నామినేటెడ్ పదవుల్లో భాగంగా..బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇప్పటికే అధినాయకత్వం పలు పదవులను గతంలో ఆఫర్‌ చేయగా ఆయన తిరస్కరించారు. తనకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు ప్రచారం సాగింది.

గతంలో ఆఫర్లు వచ్చినా..కాదంటూ

గతంలో ఆఫర్లు వచ్చినా..కాదంటూ

నాయకత్వం మాత్రం నంద్యాల నుంచి ఎర్రబోతుల వెంకటరెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే ఎన్నికల అనంతరం వెంకటరెడ్డి మృతి తర్వాత జడ్పీ చైర్మన్‌గా ఆ పార్టీ నుంచి పలువురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. తనకు రాని పదవికి తన అనుచరుడైన మిడ్తూరు జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన యుగంధర్‌రెడ్డి పేరును సిద్ధార్థరెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం సాగింది. ఆయన ప్రతిపాదించిన నాయకుల్లో ఇప్పటికే చాలామందికి పదవులు దక్కాయి. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లుగా కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది.

జగన్ హామీ మేరకు...భవిష్యత్ లో..

జగన్ హామీ మేరకు...భవిష్యత్ లో..

కోరుకున్న విధంగానే రాష్ట్ర స్థాయి ఛైర్మన్ పోస్టు దక్కించుకున్నారు. అందునా.. యువతతో సంబంధం ఉన్న పోస్టు కావటంతో మరింత క్రేజ్ సంపాదించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా యువతను కదిలించే అవకావం ఉన్న శాఖ కావటంతోనే..బైరెడ్డికి దీనిని అప్పగించారని పార్టీలో చర్చ సాగుతోంది. మరి..వచ్చే ఎన్నికల నాటికి బైరెడ్డి తన పదవి ద్వారా తన భవిష్యత్ రాజకీయాలకు ఎటువంటి బాట వేసుకుంటారో చూడాలి.

English summary
Byreddy Sidhartha Reddy appointed AS SAAP chairman from nandikotkur. He has mass and youth following in the district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X