Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సొంత కొడుకు పై నమ్మకం లేదు, అరువుకు దత్తపుత్రుడు: జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ మరోసారి టీడీపీఅధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సొంత బలం,సొంత కొడుకు పైన నమ్మకం లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు దేనికైనా సిద్ధపడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ నగరిలో పర్యటించారు.విద్యా దీవెన నిధులను విడుదల చేశారు.నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11300 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 84 వేల మంది తల్లుల ఖాతాల్లో 680 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 28 ఏళ్ల క్రితమే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని జగన్ ప్రశ్నించారు.

CM Jagan key comments against Chandrababu, releases Vidya deevena funds at Nagari

సొంత కొడుకు పైనే నమ్మకం నమ్మకం లేదని అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు మోసాలతోనే నిలిచిందన్నారు. రెచ్చగొట్టి శవరాజకీయాలు చేయాలనేదే చంద్రబాబు ఉద్దేశమని సీఎం వ్యాఖ్యానించారు పోలీసులపై పుంగనూరులో రాళ్లు కర్రలు బీరు సీసాలతో దాడి చేయించారని ఆరోపించారు.

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రోజున ఆయన పేరుతో నాణెం విడుదల చేస్తుంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లను ఆయనే సృష్టించి, తమ పార్టీ మీద ఫిర్యాదు చేయటానికి సీఈసీ కలుస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. తాను ఎక్కించిన దొంగ ఓట్లపై తానే ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. అబద్ధాలు కుట్రలు చేయటమే చంద్రబాబు రాజకీయమని జగన్ ఆరోపించారు.

CM Jagan key comments against Chandrababu, releases Vidya deevena funds at Nagari

ఎన్నికల ముందు మేనిఫెస్టో స్వర్గం చూపిస్తానంటారని తర్వాత నరకం చూపించటం చంద్రబాబుకు అలవాటని ముఖ్యమంత్రి విమర్శించారు. అటువంటి వ్యక్తి చెప్పే మాటలు, చెప్పిన ప్రతి మాట అమలు చేసే తమ పార్టీ మధ్య తేడాను గమనించాలని జగన్ సూచించారు.తన నాలుగేళ్ల పాలనలో రెండు లక్షల 33 వేల కోట్లు ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

నాడు చంద్రబాబు పాలనకంటే ప్రస్తుతం అప్పుల గ్రోత్ రేట్ తక్కువగా ఉందని కానీ నాడు ఇదే రకమైన మంచి ఎందుకు జరగలేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని, అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓకే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితే తనకు తోడుగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. మంత్రి రోజా అభ్యర్థన మేరకు పవర్‌లూమ్స్ మీద విద్యుత్ చార్జీలను మినహాయిస్తున్నట్లు నగరి వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+