చంద్రబాబు స్క్రిప్టు - ప్యాకేజీ స్టార్ డైలాగ్స్ : పొరపాటు చేస్తే జరిగేదిదే - సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ లక్ష్యంగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు స్క్రిప్టును కాల్షీట్స్ ఇస్తూ ప్యాకేజ్ స్టార్ డైలాగ్స్ గా మార్చుతున్నారని ఫైర్ అయ్యారు. పొరపాటున వాళ్లు అధికారంలోకి వస్తే స్కీంలు రద్దు అవుతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వీళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదవారిని తరిమేస్తారని..పెత్తందార్ల పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రతీ ఇంట మంచి జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు.
పొరపాటు జరిగితే ఇంతే : ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఇద్దరు నేతలు రోడ్డెక్కారని విమర్శించారు. వీళ్లు వస్తేనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని చెబుతున్నారని, నాలుగేళ్లుగా ఎవరు వస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని ప్రశ్నించారు.

వీళ్లు అనుకున్న దాని కంటే వేగంగా ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు దండగని, రద్దు చేయాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లు పొరపాటు చేస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని సీఎం హెచ్చరించారు. రాష్ట్రం నుంచి పేదలను తరిమేస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు పేదలు..పెత్తందార్ల మధ్య జరిగేవిగా పేర్కొన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే పేదవాడు బతికే పరిస్థితి ఉండదన్నారు.
చంద్రబాబు..పవన్ లక్ష్యంగా : ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో రూ 2.10 లక్షల కోట్ల రూపాయాలు నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో నగదు జమ చేసామని చెప్పారు. జగన్ కు ఓటు వేయకపోయినా.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విధంగా పాలన అందించామన్నారు. పేదలకు డబ్బులు ఇవ్వటం బాధ్యతారాహిత్యమని టీడీపీ, గజ దొంగల ముఠా ప్రచారం చేస్తుందన్నారు.
జీవీ రావు లాంటి జోకర్ ను తీసుకొచ్చి రాష్ట్రంలో పథకాల పైన ఇంటర్వ్యూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏగా జీవీ రావు సర్టిఫికెట్ ను డిబార్ చేసారని..అటువంటి వ్యక్తిని ఆర్దిక నిపుణుడుగా ప్రచారం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల ప్రతీ మాటలో మోసం, పెత్తందారి తన కనిపిస్తుందన్నారు. పేదలకు మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాబోయే రోజుల్లో ఈ అబద్దాలు, ప్రచారం మరింత పెరుగుతందని హచ్చరించారు.

మంచి జరిగిందని నమ్మితే : దశాబ్దాల కాలంగా ఉన్న చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా సంపూర్ణ హక్కును కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 మంది రైతులకు మేలు చేసేలా దాదాపు 20 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును ముఖ్యమంత్రి జగన్ కావాలిలో ప్రారంభించారు.
తాము చేసే ప్రతీ ఖర్చు మానవ వనరుల మీదే చేస్తున్నామ ని ముఖ్యమంత్రి వివరించారు. రానున్న 15 ఏళ్ల కాలంలో ప్రతీ బిడ్డ ఇంగ్లీషులోనే మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. వచ్చే యుద్దంలో మంచి జరిగిందని ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. వారే సైన్యంగా మారాలని సూచించారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్











Click it and Unblock the Notifications