Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడు పెళ్లిళ్లతోనే మేలా - చెప్పు చూపిస్తారా : ఒక్కడిని కొట్టడానికి వీళ్లంతా ఒక్కటిగా-సీఎం జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు -పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అయ్యారు. తాజాగా పవన్ కళ్మాణ్ చేసిన వ్యాఖ్యల పైన సీఎం స్పందించారు. దత్తపుత్రుడి దత్త తండ్రి ఏమని మాట్లాడిస్తున్నడో చూసామని సీఎం వ్యాఖ్యానించారు. అవనిగడ్డలో 22 ఏ (1) సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు క్లియరెన్స్ పత్రాలను సీఎం జగన్ జారీ చేసారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం ఆఫీసులు - కోర్టుల చుట్టూ తిరగకుండా న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ ప్రాంతానికి..ఎవరికీ అన్యాయం చేయమని చెబుతున్నామన్నారు. కాదు మూడు పెళ్లిళ్ల వలనే మేలు జరుగుతందని...మీరు చేసుకోండని చెబుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు.

మన ఆడవాళ్ల పరిస్థితి ఏంటి.. నాలుగు అయిదేళ్లు కాపురం చేసి విడాకులు ఇవ్వటం మొదలు పెడితే మీరు చేసుకోండని చెబుతూ పోతే..ఆడవారి జీవితాలు ఏం కావాలని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి వారు దశ- దిశ చూపగలరా ఆలోచించాలని సీఎం సూచించారు. వెన్నుపోటు దారులంతా కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్దం చేస్తామంటున్నారని చెప్పారు. ఒక్క జగన్ ను కొట్టటానికి ఇంత మంది ఏకం అవుతున్నారు. పెత్తందారులతో మరో 18 నెలల పాటు నిరంతరం పోరాటం జరుగుతుంది. మంచికి -మోసానికి జరుగుతున్న యుద్దం. పేదవాడికి -పచ్చ చొక్కాల పెత్తందారుకు మధ్య యుద్దంగా అభివర్ణించారు. మంచి జరిగిన ప్రతీ ఇంటి నుంచి ప్రతీ ఒక్కరూ తనకు తోడుగా నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. వాళ్లలాగా కుట్రలు - కుతంత్రాలను నమ్ముకోలేదని సీఎం పేర్కొన్నారు.

CM Jagan takes a strong dig at Pawan Kalyan comments, targets on marriage and alliance

సామాజిక న్యాయం - సమజాన్ని ముక్కలు చెక్కలు చేసే వాళ్ల మధ్య యుద్దంగా పేర్కొన్నారు. ఈ మోసాలను నమ్మవద్దు..ఈ పేపర్లు చదవద్దు- టీవీలు చూడవద్దని జగన్ పిలుపునిచ్చారు. ఇంట్లో మంచి జరిగిందంటే జగన్ కు తోడుగా నిలవండని సీఎం సూచించారు. నాకు మీ మద్దతు చాలు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. చేసిన మంచి చెప్పుకోలేరు. వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బూతులు తిట్టటంలో ఏ స్థాయిలోకి వెళ్లారో చూసామని... వీధి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడరన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్లు మన నాయకులా అనిపిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలని సీఎం సూచించారు.

చేసింది సగర్వంగా చెప్పుకుంటూ ఎమ్మెల్యేలు గడప గడప ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటున్నారని సీఎం వివరించారు. వచ్చే ఏడాది చివరికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవిన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ హక్కుల పత్రాలను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అవినీతి- వివక్ష లేకుండా అందించాలనే తపన పడుతున్న ప్రభుత్వంగా సీఎం వివరించారు. మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం నెరవేర్చామని సీఎం జగన్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+