సీఎం జగన్ ఫిక్స్ - ఆ ఇద్దరూ లక్ష్యంగా : మీ బిడ్డ ఏది చెబితే - అదే చేస్తాడు : మీరే తేల్చండి- సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఎన్నికల ప్రసంగాల తరహాలో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు - జనేన అధినే పవన్ ను దత్తపుత్రుడు అంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాత్మకంగా విమర్శలు ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల సభ లో సీఎం జగన్ గత పాలనలో చంద్రబాబు రైతులను మోసం చేసారంటూ ధ్వజమెత్తారు. రైతులను మోసం చేసిన చంద్రబాబును నాడు మద్దతిచ్చిన దత్తపుత్రుడు ఏనాడు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.

జగన్ మీ బిడ్డ ఆశీర్వదించండి
అదే సమయంలో.. జగన్ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒక విధంగా...తరువాత మరో విధంగా ఉండేవాడు కాదు. ఏది చెబుతాడో అదే చేస్తాడు. చితశుద్ది ఉంది...మంచి చేయాలనే మనసు ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు - తనకు తేడా అదేనని వివరించారు. తాను రాజకీయాల కోసం ఎవరినీ మోసం చేయనని చెప్పారు.
రైతు రుణ మాఫీ చేస్తామంటూ 2014 లో మేనిఫెస్టోలో ప్రకటించి..ఆ తరువాత మేనిఫెస్టోనే మాయం చేసిన చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు నిలదీయలేదని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని..ఈ మూడేళ్ల కాలంలో రైతులకు జరిగిన మంచి ఏంటో మీరే వివరించాలని సీఎం జగన్ సూచించారు. ఇప్పుడు రైతు పరామర్శ యాత్రంటూ చంద్రబాబు దత్తపుత్రుడు బయల్దేరాడని..పరిహారం అందని ఏ ఒక్క రైతును చూపించలేకపోయారని సీఎం ఎద్దేవా చేసారు.

దత్తపుత్రుడంటూ పెరిగిన రాజకీయ దాడి
అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత వీరికి ఉందా అంటూ నిలదీసారు. ఈరోజున పార్టీ నేతలంతా 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోతో పాటుగా తాను రాసిన లేఖలతో గడప గడపకు వెళ్లి.. వాళ్లకు చేసిన మంచిని వివరించి..వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారని వివరించారు. ఆక్వా జోన్ పది ఎవరకాల వరకు రూపాయిన్నార విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
కొల్లేరు రీ సర్వే కు ఆదేశాలు ఇచ్చాం..అమలవుతాయని జగన్ స్పష్టం చేసారు. మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదన్నారు. ఏ పంటకు ఆ కాలంలోనే నష్ట పరిహారం అందిస్తున్నామని వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా తమ మేనిఫెస్టోలో ప్రతీ రైతుకు నాలుగేళ్లో 50 వేలు ఇస్తామని చెప్పామని చెప్పామన్నారు.

మీరే తేడా గమనించండి - నిర్ణయించండి
అయితే, ఏడాదికి 13,500 చొప్పున ఇస్తున్నాం..అయిదేళ్లపాటు.. చెప్పిన దాని కంటే ఎక్కువగా ఇస్తున్నామని వివరించారు. 87 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి..రూ 15వేలు చేసిన చంద్రబాబు అసలు రైతుల గురించి ఎలా మాట్లాడుతారని నిలదీసారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ 23, 875 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసామని చెప్పారు. 65 లక్షల 67 వేల మంది రైతులకు 1282 కోట్లతో సున్నా వడ్డీ తో ప్రోత్సాహం అందించామన్నారు. భీమా సొమ్ము కింద 31 లక్షల మంది రైతులకు అయిదు వేల కోట్ల జమ చేసామని ముఖ్యమంత్రి వివరించారు. గత పాలనకు..ప్రస్తుత పాలనకు తేడా గమనించాలని సీఎం జగన్ కోరారు.