కుప్పం కేంద్రంగా సీఎం జగన్ కీలక ప్రకటన - టార్గెట్ చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో కీలక వ్యాఖ్యలు చేసారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు ఏం చేసారని ప్రశ్నించారు. తన 58 నెలల పాలనలో కుప్పంకు జరిగిన మంచి గుర్తించాలని కోరారు. జరిగిన లబ్దిని వివరించారు. చంద్రబాబు మార్క్ రాజకీయం ఏంటో విశ్లేషించారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. రంగాను హత్య చేయించింది ఎవదో అందరికీ తెలుసని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
కుప్పంలో సీఎం జగన్: సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేశామని తెలిపారు. 35 ఏళ్ల కాలంగా కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబును గెలిపించాల్సిన అవసరం ఉందా అని జగన్ ప్రశ్నించారు.

చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారని గుర్తు చేసారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యే గా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదననారు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కుప్పం ప్రజల మంచితనానికి జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా అని నిలదీసారు.
మంచి చేస్తే పొత్తులెందుకు: చంద్రబాబు మంచి చేసి ఉంటే పొత్తులెందుకని ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. దత్తపుత్రుడుతో నాలుగు గోడల మధ్య ప్యాకేజీల గురించి చర్చలు చేస్తారని విమర్శించారు. రంగాను హత్య చేయించింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బీసీ సీట్ల పైన డబ్బుతో చంద్రబాబు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన భరత్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకో ఆలోచించాలన్నారు. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టో తో వస్తారని అలర్ట్ చేసారు. కుప్పంకు తన హయాంలో జరిగిన మేలును జగన్ వివరించారు. కుప్పంకు కృష్ణమ్మ నీరు..కుప్పాన్ని మున్సిపాలిటీగా..కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది తన హాయంలోనే అని చెప్పారు.

బీసీ నియోజకవర్గంలో పెత్తనం: కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని గుర్తు చేసారు. రూ. 3 వేలకు పెన్షన్ పెంచి 45,374 మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించామన్నారు. కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని జగన్ వెల్లడించారు. అందుకోసం పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చామని చెప్పారు.
కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడూ విమర్శంచలేదని, మీరంతా నావాళ్లేనని గర్వంగా చెప్పుకున్నానని జగన్ పేర్కొన్నారు. ఈ నెలలోనే కుప్పంలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. బీసీ సీటును కబ్జా చేసి ధన బలంతో 35 ఏళ్లుగా రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పేదల భవిష్యత్ బాగుండాలంటే తన ప్రభుత్వానికి మద్దతివ్వాలని జగన్ కోరారు.
Hon’ble CM @ysjagan will be Participating in Unveiling of New Tanks Plaque and Addressing the Public Meeting in Kuppam. #YSJaganForKuppam https://t.co/NhcNgRJVlf
— YSR Congress Party (@YSRCParty) February 26, 2024












Click it and Unblock the Notifications