ముఖ్య నేతలకు జగన్ పిలుపు - కీలక నిర్ణయాలు, గేమ్ ఛేంజర్..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. పార్టీలు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకట్టుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. సీఎం జగన్,చంద్రబాబు, పవన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ తన అన్న జగన్ టార్గెట్ గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జగన్ ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ ప్రచారం
ముఖ్యమంత్రి జగన్ రోజుకు మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. పథకాలు కొనసాగాలంటే వైసీపీ రావాలని..టీడీపీకి ఓటు వేస్తే పథకాలు రావని చెబుతున్నారు. చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా అమలు చేయరనేది ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకున్నారు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదల అయింది. ఈ మేనిఫెస్టో తమ రెండు పార్టీలు ప్రకటిస్తున్నాయని.వీటిని అమలు చేసే బాధ్యత తమదేనని చంద్రబాబు స్పష్టం చేసారు. దీంతో..హామీలు..అమలు..విశ్వసనీయత అనేది ఈ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలు మరో పది రోజుల్లో జరగునున్న వేళ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీకి నిర్ణయించారు.

ముఖ్య నేతలతో సమీక్ష
ముఖ్యమంత్రి జగన్ రేపు (గురువారం) తన ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులు ప్రచారం చేస్తున్న తీరు..కూటమి ప్రభావం వంటి అంశాల పైన జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే వైసీపీ ముందంజలో ఉన్న నియోకవర్గాలతో పాటుగా.. ఏ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉందనే లెక్కలను జగన్ ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తున్నారు. అయిదు రకాల సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్దులను అలర్ట్ చేస్తున్నారు. పార్టీ ఎక్కడైతే కొంత వెనుకంజలో ఉన్నట్లుగా గుర్తించారో అక్కడ జగన్ ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 11వతేదీతో ప్రచారం ముగియనుండటంతో..జగన్ ప్రచార సభలను పెంచే ఆలోచన జరుగుతోంది.

కూటమి పై దూకుడుగా
ఇక వైసీపీ మేనిఫెస్టో ప్రకటన..తాజాగా టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకటించటంతో క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం పైన జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎలక్షనీరింగ్ లో పార్టీ అభ్యర్దులు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో బాధ్యతలను రీజనల్ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలకు అప్పగించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పెన్షన్ల గురించి వైసీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన హామీలు అమలు సాధ్యం కాదని జగన్ ప్రతీ సభలో చెబుతున్నారు. గెలుపు పైన అతి విశ్వాసంతో కాకుండా ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు, కూటమి పైన పోరాటం విషయంలో జగన్ ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications