వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ తో అదే సమస్య అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు - డెసిషన్ టైం..!!

|
Google Oneindia TeluguNews

ఎన్నికల నిర్ణయాల్లో భాగంగా సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పై నేరుగా హెచ్చరికలు చేసారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కవ కాదని తేల్చి చెప్పారు. అదే సమయంలో 27 మంది ఎమ్మెల్యేల పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. తాజాగా.. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు..జిల్లా అధ్యక్షుల నియామకంలో సీఎం జగన్ తన మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. గతంలో డెడ్ లైన్ ఫిక్స్ చేసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. వచ్చే నెల 14న కీలక సమావేశం జరగనుంది.

సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన మొదలు

సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన మొదలు


వై నాట్ 175. ఇదే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో నినాదం. ఇందు కోసం పార్టీలో ముందస్తుగానే సీఎం జగన్ ప్రక్షాళన ప్రారంభించారు. ముందుగా ప్రాంతీయ సమన్వయకర్తలు..జిల్లా అధ్యక్షుల నుంచి మొదలైన ఈ ప్రక్షాళనలో ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. గతంలో జరిగిన సమావేశాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 27 మందిని పని తీరు మార్చుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. వారంతా వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేలుగా ఉండాలని తాను కోరుకుంటున్నానని..దీని కోసం పని తీరు మెరుగుపర్చుకొనే అవకాశం ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. అందుకు సమయం నిర్దేశించారు. ఇక, ఇప్పుడు ఆ సమయం ముగిసిందది. డిసెంబర్ 14న గడప గపడకు ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహణకు నిర్ణయించారు. అందులో గతంలో హెచ్చరించిన ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి నివేదికలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఆ ఎమ్మెల్యేలకు ముగస్తున్న డెడ్ లైన్

ఆ ఎమ్మెల్యేలకు ముగస్తున్న డెడ్ లైన్


ప్రాంతీయ సమన్వయ కర్తలు..జిల్లా అధ్యక్షులులగా సీనియర్ల విషయంలోనూ నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకొని..ఎమ్మెల్యేకు సీఎం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు నియోజవకర్గాల వారీగా మూడు రకాల సర్వే రిపోర్టులు సీఎం వద్దకు చేరాయి. నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో సమన్వయం కోసం కో ఆర్డినేటర్ల నియామకం పైనా సీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 14న జరిగే సమావేశం లో నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల పేర్లను వెల్లడించనున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సీఎం జగన్ తన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎంత మందికి తిరిగి సీట్లు కేటాయిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. సాధ్యమైన మేర సిట్టింగ్ లకు అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తానని సీఎం స్పష్టం చేసారు.

సీఎం ఇమేజ్ పెరుగుతోంది.. ఎమ్మెల్యేలుగా మాత్రం

సీఎం ఇమేజ్ పెరుగుతోంది.. ఎమ్మెల్యేలుగా మాత్రం


ఇదే సమయంలో..క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల స్పందన భిన్నంగా ఉంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తెస్తాయని సీఎం జగన్ సహా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, సంక్షేమ పథకాలను నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదలు చేస్తున్నారు. దీంతో, ప్రజలతో ప్రత్యక్షంగా - పరోక్షంగా ముఖ్యమంత్రితో సంబంధాలు కొనసాగుతున్నాయి. సీఎం తమకు పథకాలు ఇస్తున్నారనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఓవరాల్ గా సీఎం జగన్ పథకాల పైన లబ్దిదారులు సంతోషంగా ఉన్నా..ఎమ్మెల్యేలుగా పథకాల అమల్లో తమ భాగస్వామ్యం నామమాత్రంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సచివాలయాలతో ప్రజలు సమస్యల మీద తమ వద్దు రావటం తగ్గించారనేది మరో కారణంగా చెబుతున్నారు. దీంతో.. ముఖ్యమంత్రికి మైలేజ్ పెరుగుతున్నా..ఎమ్మెల్యేలుగా తమకు తగిన గుర్తింపు దక్కటం లేదనేది వారి ఆవేదన. దీంతో..సీఎం ఇమేజ్ మరింత పెంచటం ద్వారానే తాము మరోసారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది.

English summary
CM Jagan to conduct party work shop on December 14th to dsicuss MLAs performance in ground level, now it lead to new tension in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X