Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

19న తల్లుల ఖాతాల్లోకి నగదు జమ - ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!!

జగనన్న విద్యా దీవెన నిధులు ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

చదువుకు పేదరికం అడ్డు కాకూడదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ పేద విద్యార్ధుల కోసం విద్యా దీవెన పథకం ప్రారంభించారు. పేద విద్యార్ధుల చదువుకు ఎంత ఖర్చు అయినా భరిస్తామని జగన్ నాడు పాదయాత్ర సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తుంది. మలి విడత జగనన్న విద్యా దీవెన నిధులు ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

ఈ నెల 19న విద్యా దీవెన నిధుల విడుదల

ఈ నెల 19న విద్యా దీవెన నిధుల విడుదల

2019 నవంబర్ లో ఈ పథకాన్ని పేద విద్యార్ధుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్ధులు తమ కళాశాలలకు కట్టాల్సిన ఫీజులను మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. 10.82 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతోంది. ఈ ఏడాది 2023-24 వార్షిక బడ్జెట్ లో ఈ పథకం కోసం రూ 2841 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. స్టూడెంట్స్ కళాశాలలకు కట్టాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని.. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

అర్హులైన ప్రతీ విద్యార్దికి అండగా

అర్హులైన ప్రతీ విద్యార్దికి అండగా

జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారు. ఇదే సమయంలో విదేశాల్లో చదువుకోవాలని కోరుకునే పేద విద్యార్ధులకు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ఎలాంటి కోటాలు లేకుండా అర్హులైన విద్యార్ధులందరికీ సంతృప్త స్ధాయిలో జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నారు.
అంతేకాదు పూర్ స్టూడెంట్స్ భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా చేస్తోంది సీఎం జగన్ క్రమం తప్పకుండా వీరికి ఆర్దికంగా తోడ్పాటును అందిస్తు అండగా నిలుస్తున్నారు. ఈ పథకం ద్వారాటాప్‌ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.కోటి వరకు 100 శాతం ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతోంది.

విదేశీ విద్యకు ప్రోత్సాహం

విదేశీ విద్యకు ప్రోత్సాహం

100 - 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100శాతం ట్యూషన్‌ ఫీజు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రీయిబర్స్‌మెంట్‌ చేయాలని నిర్ణయించారు. మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్‌ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలను సైతం ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది. జగనన్న వసతి దీవెన స్కీమ్ కింద ఏటా 2 వాయిదాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందజేస్తోంది. అలాగే ఐటీఐ స్టూడెంట్స్‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ స్టూడెంట్స్‌కు రూ.15 వేలు ఇస్తుంది. చదువు పైన చేసే ఖర్చు రేపటి అభివృద్ధికి పెట్టుబడిగా జగన్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+