ప్రాంతీయ విబేధాల్లేవ్, ముల్లు గుచ్చితే నోటితో తీస్తా: 'సెటిలర్స్'లేదన్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో పలువురు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయవాదానికి తావులేదన్నారు. మీ తాతలు, తండ్రుల నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారని సీమాంధ్రవాసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇక సెటిలర్స్ అనే పదానికి తావు లేదని చెప్పారు. మెదక్ జిల్లాలో పుట్టిన తాను హైదరాబాదీనే అని చెప్పారు.

హైదరాబాదులో ఉన్న వాళ్లంతా తెలంగాణవారేనని చెప్పారు. హైదరాబాదులో స్థిరపడ్డ వారితో త్వరలో తాను సమావేశం అవుతానని చెప్పారు. ఇకపై ప్రాంతీయ విబేధాలు ఉండవని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రాప్రాంత వాసుల పట్ల ఇక ముందు వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. సెటిలర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్నారు. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రావాసుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదన్నారు. ఉద్యమ సమయంలో బావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే కాని వారి పట్ల ఎలాంటి వివక్ష చూపించమన్నారు.












Click it and Unblock the Notifications