ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది.
ఆరు నెలలుగా ముందుగానే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఇటీవలే హస్తిన సందర్భంగా వైఎస్ జగన్ ఇదే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వద్ద కూడా ప్రస్తావించారనే ప్రచారం కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే.

ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. వైఎస్ జగన్ దీనికి అధ్యక్షత వహించనున్నారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ ఇదివరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 5వ తేదీ మధ్యాహ్నానికే ఆయా ప్రతిపాదనలన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.
పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను వేల కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయడం, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి వంటి అంశాలను మంత్రివర్గం చర్చించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవలే చేపట్టిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వైఎస్ జగన్.. ఆ సమావేశం ద్వారా మంత్రులకు వివరించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, అందుకు రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులను మంజూరు చేయడమే నిదర్శనమని గుర్తు చేయనున్నారు. ఈ రెండు అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని కూడా జగన్- మంత్రులకు సూచిస్తారని సమాచారం.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తమ హయాంలోనే పూర్తవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్.. మంత్రులకు సూచిస్తారని తెలుస్తోంది. అలాగే- కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదిస్తారని సమాచారం. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ఆరోపణలను ఎలా తిప్పి కొట్టాలనే విషయంపైనా వైఎస్ జగన్- తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

టీడీపీ ఆరోపణలు, విమర్శలను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు- వాటిల్లో ఉన్న డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులకు సూచనలు చేస్తారని సమాచారం. జగనన్నే మన భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాలపై ఆయన సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారని సమాచారం.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications