విదేశీ విద్యా దీవెన అర్హులకు జగన్ సర్కార్ తీపి కబురు
అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారులకు ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ఈ పథకం కింద అర్హులైన వారికి గురువారం నిధులను విడుదల చేయనుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ నిధులను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఆర్థిక సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ దఫా 357 మంది విద్యార్థులను ఈ పథకం కింద అర్హులుగా గుర్తించింది. విదేశీ విద్యా పథకం కింద వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రెండు విడతల్లో అర్హులను ఎంపిక చేస్తుంది.

357 మంది విద్యార్థుల కోసం సుమారు 46 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కోటీ 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్ కింద చెల్లిస్తుంది. వందశాతం మేర ఫీజు రీఎంబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కోటీ 25 లక్షల రూపాయల వరకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లిస్తుంది. మిగిలిన వారికి కోటి రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ట్యూషన్ ఫీజు కింద 75 లక్షల రూపాయలు, ఇతర విద్యార్థులకు 50 లక్షల రూపాయల వరకు ట్యూషన్ ఫీజును ప్రభుత్వం భరిస్తుంది.












Click it and Unblock the Notifications