తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో వైసీపీ నేతల తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.వైసీపీ నేతలు విధానాలపై చర్చించకుండా తిట్ల దండకమే చేస్తున్నారని పవన్ తీవ్రంగా విమర్శించారు. గతంలో కాకినాడలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, 11సీట్లు వచ్చినా వైసీపీ నేతలు మారలేదని అన్నారు.

బాలినేని వంటి నేతలు జనసేనలోకి ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ ప్రశ్న

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తాను ఒక్క కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడినైతే బాలినేని వంటి నేతలు జనసేనలోకి ఎందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు. జనసేన అన్ని వర్గాల ప్రజల కోసం పని చేసే పార్టీ అని, అందరూ ఆ నమ్మకంతోనే చేరుతున్నారని వివరించారు.

deputy cm pawan kalyan comments on balineni srinivas reddy joining in janasena in party meeting

కులాల పేరుతో రాజకీయాలు తనకు ఇష్టం లేదన్న పవన్ కళ్యాణ్

జనసేన నేత పంతం నానాజీ మాట్లాడిన విషయాలను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. కులాల పేరిట రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ ఒకే హాస్టల్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కులాలతో రాజకీయాలు చేయనని, చేయబోనని గట్టిగా ప్రకటించారు. పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తల సమాచారం పారదర్శకంగా సేకరించాలని కమిటీలను ఆదేశించారు.

నిజమైన కార్యకర్తలను గుర్తించాలని కమిటీలకు ఆదేశం

ఎన్ని ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారో బేరీజు వేసి, నిజమైన కార్యకర్తలను గుర్తించాలని సూచించారు. కమిటీలు సేకరించిన వివరాలను తన దృష్టికి తీసుకురావాలని, పార్టీ అభివృద్ధికి ఉపయోగపడేలా పని చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశం ద్వారా జనసేన పార్టీలో కార్యకర్తల సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు.

బంజారాహిల్స్ పీఎస్ కు వింత పంచాయితీ.. వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయట్లేదని మహిళ ఫిర్యాదు!
బంజారాహిల్స్ పీఎస్ కు వింత పంచాయితీ.. వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయట్లేదని మహిళ ఫిర్యాదు!

స్పష్టమైన విధానాలతో జనసేన ముందుకు వెళ్తుందన్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలో పారదర్శకత, కష్టపడిన కార్యకర్తల గుర్తింపు అత్యంత ముఖ్యమని ఆయన చెప్పారు. వైసీపీ నేతల వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించిన ఆయన, జనసేన పార్టీ స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశం జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ చేపట్టిన చర్యలు భవిష్యత్తులో పార్టీకి ఎలా దోహదం చేస్తాయో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+