కౌలు రైతులకు జగన్ శుభవార్త
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. కౌలు రైతుల ఖాతాలకు ఉద్దేశించిన నిధులు ఇవి. వారి ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు వైఎస్ జగన్.
దేవదాయ భూములను సాగు చేసుకుంటోన్న రైతులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. వారికీ ఈ నగదు మొత్తం అందుతుంది. వరుసగా అయిదో సంవత్సరం కూడా కౌలు రైతులు, దేవాదాయ భూములను సాగు చేసుకుంటోన్న రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనుంది.

కౌలు రైతులను గుర్తించడానికి ప్రభుత్వం ఇదివరకే క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డులను అందజేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 1,42,693 మంది ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ కౌలుదారులకు సీసీఆర్సీలను అందజేసింది. వారిని కౌలు రైతులుగా గుర్తించినట్టయింది. వారితో పాటు మరో 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సీసీఆర్సీ కార్డులను మంజూరు చేసింది.
దేవాదాయ భూములను సాగు చేసుకుంటోన్న కౌలు రైతులకు రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయబోతోండటం ఇదే తొలిసారి. 7,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది ప్రభుత్వం. మొత్తం 109.74 కోట్ల రూపాయలను దీనికోసం వ్యయం చేయనుంది. బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బును జమ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 76.21 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీఆర్సీ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులను జారీ చేయడం ద్వారా కౌలు రౌతులను అధికారికంగా గుర్తించింది. వారికి పంట రుణాలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద నగదు సాయం అందజేస్తోంది.












Click it and Unblock the Notifications