మళ్లీ తాడేపల్లి నుంచి పిలుపు - వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు: ఐప్యాక్ టీమ్ రిపోర్ట్స్‌తో..!!

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. ఇందులో భాగంగా తరచూ వర్క్‌షాప్‌‌లను నిర్వహిస్తోన్నారు.

గడప గడపకూ మన ప్రభుత్వం..

గడప గడపకూ మన ప్రభుత్వం..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత్‌లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.

 డిసెంబర్ 4న..

డిసెంబర్ 4న..

డిసెంబర్ 4వ తేదీన వైఎస్ జగన్ మరోసారి వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొననునన్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు, సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు.

ఐప్యాక్ టీమ్‌తో..

ఐప్యాక్ టీమ్‌తో..

ఐప్యాక్‌ టీమ్‌తో వైఎస్ జగన్ ఆ నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. ఇదివరకు జరిగిన రెండు వర్క్‌షాప్‌లల్లో కొందరు ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో మంత్రులు కూడా ఉన్నారు. వారి పనితీరుపై ప్రత్యేకంగా నిఘా వేశారాయన. ఏ మాత్రం తేడా కొట్టినా మరోసారి వార్నింగ్ ఇచ్చే ప్రసక్తే ఉండబోదని, టికెట్ల కేటాయింపుల్లో వారికి ప్రాధాన్యత ఉండబోదనే సంకేతాన్ని ఈ వర్క్‌షాప్‌లో ఇస్తారని చెబుతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో..

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో..

ఈ పరిణామాలన్నీ- గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదంటూ ఫిర్యాదులను అందుకున్న అధికార పార్టీ సిట్టింగ్ శాసన సభ్యుల్లో ఆందోళనకు కారణమౌతోంది. 175 నియోజకవర్గాలన్నింట్లోనూ గెలిచి తీరాలంటే.. కొన్ని కఠిన నిర్ణయాలను వైఎస్ జగన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తర-తమ తేడా చూడట్లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.

అభ్యర్థులపై మార్పుపై.

అభ్యర్థులపై మార్పుపై.

.

కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చితేనే విజయం సాధించగలుగుతామనే అభిప్రాయం వైఎస్ జగన్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి చోట ప్రత్యామ్నాయ అభ్యర్థులను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారనే అంచనాలు లేకపోలేదు. సిట్టింగుల స్థానాల్లో కొత్త వారికి టికెట్లు ఇవ్వడానికీ సంకోచించట్లేదని తేల్చేస్తోన్నాయి. అలాంటి ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్‌ అభ్యర్థులను మార్చాల్సి ఉంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారనీ వివరిస్తోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+