పెద్దిరెడ్డి బినామీలకు 980 ఎకరాలు, జమిందార్ల భూమితో జల్సాలు, కలెక్టర్ స్కెచ్
గత వైసీపీ ప్రభుత్వం హమాయంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో తాసిల్దార్ నుండి కలెక్టర్ వరకు అందరూ కలిసి వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బినామీలకు అప్పగించి చేతులు దులుపుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దర్యాప్తులు వెలుగు చూడడం కలకలం రేపుతుంది.
పుంగనూరు జమీందారులకు చెందిన సుమారు రూ. 100 కోట్ల విలువైన 982 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి రామచచంద్రా రెడ్డి బినామీలకు అప్పగించారని, ఈ వ్యవహారంలో అప్పటి చిత్తూరు కలెక్టర్, నేడు తిరుపతి కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్ పూర్తిగా సహకరించారని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులోని రాగానిపల్లి లో 982 ఎకరాల భూమిని వైసీపీ నాయకులకు అప్పగించారని వెలుగు చూసింది.

విజిలెన్స్ అధికారులను నివేదిక ప్రకారం పుంగనూరు నియోజకవర్గం లోని రాగానిపల్లిలో 982 ఎకరాల భూమిని అప్పటి పుంగనూరు జమీందారు మహాదేవ రాయల కుమారుడు శంకరరాయల పేరుతో 1958 ఫిబ్రవరి 24 చిత్తు పట్టా జారీ అయింది. ఆ తర్వాత ఆ భూమిని శంకర్ రాయలు అనేకమందికి విక్రయించారు. 1977లో ఈ చిత్తు పట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేశారు. ఈ భూమిప తరువాత వివాదం మొదలైయ్యింది. ఈ ప్రభుత్వ భూమిపై సర్వే నెంబర్ 22లో ఉన్న 982 ఎకరాల భూమి వివాదం అసంపూర్తిగా ఆగిపోయింది.
2022 ఏప్రిల్ 28వ తేదీన నాటి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారింది. చట్టపరమైన అంశాలు ఏమీ పట్టించుకోకుండా చిత్తు పట్టా ఉన్న ఆ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బినామీలకు హక్కు కల్పిస్తూ అప్పటి చిత్తూరు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేశారని విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.
పెద్దిరెడ్డి బినామీలు అయిన కొందరు వైసీపీ నాయకులకు ఈ 982 ఎకరాలు భూమిని అప్పగించారని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజిలెన్స్ అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్, నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్, గతంలో పలమనేర్ ఆర్డీవోలు గా పనిచేసిన మనోజ్ కుమార్ రెడ్డి, పులి శ్రీనివాసులు, అప్పటి పలమనేరు తాహసిల్దార్ గా పనిచేసిన సీతారాం తదితరులు కొందరు వైసీపీ లబ్ధిదారులతో కుమ్మక్కు అయ్యారని వెలుగు చూసింది.

ఆ తరువాత రాగానిపల్లిలోని ఈ 982 ఎకరాల భూమి వారి పరం కావడానికి పూర్తిగా సహకరించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులు వెలుగు చూసింది. ప్రస్తుత తిరుపతి కలెక్టర్, ఆర్డీవోలు, తాసిల్దార్ కలసి వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బినామీలకు సహకరించడంతో వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి వైసీపీకి చెందిన కొందరు నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని వెలుగు చూడడంతో పుంగనూరు ప్రజలు షాక్ అయ్యారు. విజిలెన్స్ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ప్రాథమిక నివేదిక పరిశీలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications