ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిలో మూడో ప్రత్యామ్నాయంగా వామపక్షాలు సిద్ధం:సిపిఐ రామకృష్ణ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ లో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా వామపక్షాలు సంసిద్దం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రత్యేక హోదా సాధనలో అధికార, ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమైనందున మూడో ఫ్రంట్‌ అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ సదస్సులో రామకృష్ణ మాట్లాడారు. తృతీయ ప్రత్యామ్నాయ కూటమి కోసం జనసేన పార్టీతో పాటుగా భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని పోతామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా అన్ని విధాలా వెనుకబడిందన్నారు. ప్రభుత్వ నిరాదరణకు గురైన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Communist Parties are third political alternative in AP: CPI Ramakrishna

రాష్ట్రస్థాయిలోనూ ప్రకాశం జిల్లా కోసం పోరాటాలు చేస్తామని రామకృష్ణ చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు 2016 నాటికి పూర్తి చేస్తామని చెప్పి నేటికీ పూర్తి చేయలేక పోయారన్నారు. రామాయపట్నం పోర్టు కోసం కేంద్రానికి నివేదిక పంపలేదన్నారు. జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి పదేళ్లు హోదా కావాలని కోరిన బిజెపి నేతలు ఇపుడు దాటేసే సమాధానాలు చెబుతున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం, బిజెపి లకు ఓట్లడిగే అర్హత కూడా లేదన్నారు.

అన్న క్యాంటీన్లలో రూ. అయిదు భోజనానికి తోపులాట జరుగుతుంటే అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీల బతుకులు ఎక్కడా మారలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయని ఆరోపించారు. ఇక వైసిపి ఎమ్మెల్యేలు గెలిచినా అసెంబ్లీకి వెళ్లరనీ, ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదనీ ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండా బయట నుంచి నిరసన వ్యక్తం చేయటం కూడా పెద్ద డ్రామాగా రామకృష్ణ అభివర్ణించారు.

అందుకే ప్రత్యామ్నాయ పార్టీలు కీలకమన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలు రావాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌ వైఖరే కారణమని సిపిఐ విమర్శించారు. వీరిద్దరూ ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటున్నారని ప్రధాని మోదీ కి తెలిసిపోయిందని, అందుకే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు.

అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించేందుకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయించాలని, తక్షణం వెనుకబడిన జిల్లాగా గుర్తించాలన్నవి
మరికొన్ని ప్రధాన డిమాండ్లుగా చెప్పారు.

English summary
Ongole: CPI state secretary Ramakrishna said that the Left parties has become the third political alternative in Andhra Pradesh.He said that the third front was needed because ruling party and opposition failed miserably to develop state and to achieve Special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X