ఆస్తుల వెల్లడిపై అక్బరుద్దీన్ ఓవైసీపై ఈసికి ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట సిట్టింగ్ శాసనసభ్యుడు, మజ్లీస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీపై ఎన్నికల కమిషన్ (ఈసి)కి ఫిర్యాదు అందింది. ఎన్నికల అఫిడవిట్‌లో కావాలనే అక్బరుద్దీన్ తన అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ఓ వ్యక్తి ఆరోపించాడు.
దరీచా రంగే అలీ షాలో అక్బరుద్దీన్ ఓవైసీ 577 చదరపు గజాల ఇంటిని కొనుగోలు చేశాడని, దాని మున్సిపల్ నెంబర్ 18-7-316 అని, విద్యా పండిట్ రామకృష్ణ నుంచి ఓవైసీ దాన్ని 8 లక్షల 77 వేల రూపాయలకు 2005 ఏప్రిల్ 19వ తేదీన కొన్నాడని మౌలిం మోహిసిన్ బిన్ అల కసారీ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు ఆ వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీపై ఫిర్యాదు చేశాడు. కావాలనే ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఓవైసీ చెప్పలేదని ఆయన ఆరోపించాడు,.
2009 ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఆ ఇంటి విషయాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ దాచిపెట్టాడని, ఈ ఎన్నికల అఫిడవిట్‌లో కూడా దాన్ని ప్రస్తావించలేదని ఆయన అన్నాడు.












Click it and Unblock the Notifications