వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హక్కులకు భంగం: పవన్‌ కళ్యాణ్‌పై హెచ్చార్సీలో ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్‌ కళ్యాణ్‌పై అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఆగస్టు 27న తిరుపతిలో నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పలు కులాలు, మతాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుంటే.. పవన్‌ కళ్యాణ్‌ కులాల హక్కులకు భంగం కలిగే రీతిలో మాట్లాడారని వివరించారు.

complaint filed on Pawan Kalyan in HRC

తనకు కులా లు, మతాల పేరు చెబితే అరికాళ్ల నుంచి మంటపుడుతుందని సభలో పవన్‌ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో ఉదయ్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.

అంతేగాక, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయని ఏపీ సీఎం చంద్రబాబు.. పవన్‌ కళ్యాణ్‌ను అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
A complaint has been filed on Janasena chief Pawan Kalyan in HRC for comments on castes and religions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X