షర్మిలకు కాంగ్రెస్ బిగ్ టాస్క్- తెర వెనుక, చంద్రబాబు ఫిక్స్..!!

ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. షర్మిలకు పార్టీ పగ్గాలతో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ సేవలను అవసరమైన సమయంలో ఏపీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. షర్మిల పార్టీ లో చేరగానే కీలక బాధ్యతలు ఇచ్చిన పార్టీ నాయకత్వం టాస్క్ ఫిక్స్ చేసింది. షర్మిల ఎంట్రీతో జగన్ కే నష్టమనే వాదన ఉంది. ఈ సమయంలో ఢిల్లీలో సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. చంద్రబాబు ఆశిస్తోంది ఒకటి..జరుగుతోంది మరొకటిగా మారుతోంది.

కాంగ్రెస్ ప్రయత్నాలు: ఏపీలో కాంగ్రెస్ తిరిగి పంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సమయం నుంచి కాంగ్రెస్ భారీగా దెబ్బ తింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం జగన్ వైపు టర్న్ అయింది. ఆ ఓట్ బ్యాంక్ మరోసారి తమ వైపు తిప్పుకోవాలంటే షర్మిలతో సాధ్యమని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వటం ద్వారా జగన్ ఓట్ బ్యాంక్ కు గండి పడుతుందని..పరోక్షంగా తమకు సహకరిస్తుందని టీడీపీ భావిస్తోంది.

Congress Fix Task for YS Sharmila as APCC Chief, to contest for Kadapa Loksabha in next Elections

ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ గా నియమితులైన మాణిక్కం ఠాగూర్ తమ లక్ష్యం స్పష్టం చేసారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని చెబుతున్నారు.

మూడు పార్టీలు లక్ష్యంగా: వైసీపీలో టికెట్లు దక్కక ..ఆ పార్టీకి దూరంగా ఉండేవారిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా కొందరు సీనియర్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు షర్మిల ఎంట్రీ ద్వారా జగన్ కు నష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే, పార్టీ హైకమాండ్ ఏపీలో జగన్, చంద్రబాబు లక్ష్యంగా దూకుడుగా వెళ్లాలని షర్మిలకు స్పష్టం చేసింది.

ఎన్నికల సమయంలో రెండు పార్టీల్లోనూ సీట్లు రాని వారిని పార్టీలోకి చేర్చుకొనేలా వ్యూహ రచన ఉండాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నాటికి ఏపీలో అవసరం మేర తెలంగాణ సీఎం రేవంత్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. జగన్ తో పాటుగా చంద్రబాబు, పవన్ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయ పోరాటం ఉండాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీని ద్వారా మూడు పార్టీలతో పాటుగా బీజేపీకి తామే ప్రత్యామ్నయం అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేసింది.

Congress Fix Task for YS Sharmila as APCC Chief, to contest for Kadapa Loksabha in next Elections

ఎంపీగా షర్మిల పోటీ: ఇక, షర్మిలను వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం కావాలని సంకేతాలు ఇచ్చింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఏపీలో షర్మిల ఎంట్రీతో ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఏపీలో అధ్యక్షులుగా ఉన్నారు.

ఒకే కుటుంబం నుంచి అన్నా, చెల్లెలు రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తానని ఇప్పటికే షర్మిల స్పష్టం చేసారు. ఈ క్రమంలో తన కుమారుడు నిశ్చితార్ధం తరువాత షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక, రాజకీయంగా ఎలాంటి ప్రసంగాలు చేస్తారు..ఎవరిని తన ప్రధాన లక్ష్యంగా చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+