వైఎస్సార్ గుర్తొచ్చారు, కాంగ్రెస్ టార్గెట్ జగన్ - ఏం జరుగుతోంది..!!
కాంగ్రెస్ కు వైఎస్సార్ గుర్తొచ్చారు. చాలా కాలం తరువాత వైఎస్సార్ జన్మదినం నాడు ఢిల్లీ టు గల్లీ వైఎస్సార్ కు నివాళి అర్పిస్తూ కాంగ్రెస్ ముఖ్యులు ట్వీట్లు చేసారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే..రాహుల్ గాంధీ దివంగత వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకున్నారు. కొనియాడారు. పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ నాయకత్వం మరోసారి వైఎస్సార్ ను ఓన్ చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ టార్గెట్ స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్సార్ గుర్తుకొచ్చారు: వైఎస్సార్. ఈ పేరు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వినిపించాల్సిందే. వైఎస్సార్ లేకపోయినా..ఆయన సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు కొనసాగించాల్సిందే. అంతగా సంక్షేమ పథకాలతో ప్రజల మదిలో నిలిచిన వైఎస్సార్ ఇప్పుడు ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలకు గుర్తుకు వచ్చింది. వైఎస్సార్ ను విభేదించే బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఆయన తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ వంటి పథకాలు కొనసాగిస్తోంది.

2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ మరణించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ తో విభేదించింది. సీబీఐ కేసులు..ఛార్జ్ షీట్లలోనూ వైఎస్సార్ పేరు ప్రస్తావించటం వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా వైఎస్సార్ పేరు ప్రస్తావనే మానేసింది.
My tributes to senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his birth anniversary.
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2023
He was a visionary leader who devoted his life to the betterment of the people of Andhra Pradesh. He shall always be remembered. pic.twitter.com/K5pWWwiWj0
A compassionate leader of the people, he steered the development and welfare of Andhra Pradesh till his last breath.
— Mallikarjun Kharge (@kharge) July 8, 2023
Our homage to Former Chief Minister of Andhra Pradesh, Y. S. Rajasekhara Reddy on his birth anniversary.
His contribution to public life and to the Congress… pic.twitter.com/oT4xh2mn31
కాంగ్రెస్ లక్ష్యం ఫిక్స్: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పెంచుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహం. వైఎస్సార్ లెగసీని ఏపీలో జగన్ కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ అనుచరులను...మద్దతుదారులను..ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయ్యారు. వైఎస్సార్ వారసులుగా జగన్..షర్మిల చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి.
కానీ, షర్మిల తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ స్థాపించి రాజన్న రాజ్యం తెస్తామంటూ ముందుకెళ్లారు. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. చాలా కాలం తరువాత కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ఖర్గే...ముఖ్య నేత రాహుల్ వైఎస్సార్ జన్మదినం నాడు నివాళి అర్పిస్తూ ట్వీట్లు చేసారు. కేవీపీ లాంటి కొందరు ప్రతీ ఏటా వైఎస్సార్ కు నివాళి అర్పిస్తారు.

ప్లాన్ సక్సెస్ అయ్యేనా: ఈ ఏడాది గతం కంటే భిన్నంగా రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ఆయన సేవలను కీర్తించారు. రాహుల్ గాంధీ ట్వీట్ కు షర్మిల స్పందించారు. ఇప్పుడు ఎన్నికల వేళ ఇప్పటికీ చెక్కు చెదరని వైఎస్సార్ ఓట్ బ్యాంకు ను తిరిగి తమ వైపు తిప్పుకోవటమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందు కోసం షర్మిల ద్వారా పావులు కదుపుతున్నారు.
ఏపీలో జగన్ ను దెబ్బ తీయాలనేది కాంగ్రెస్ అసలు టార్గెట్. ఇందు కోసం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు షర్మిల అందుకు అంగీకరించలేదు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ జగన్ లక్ష్యంగా నే ముందుకు వెళ్తోంది. ఏపీలో జగన్ ను వైఎస్సార్ అభిమానులను దూరం చేయటం సాధ్యమేనా. జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఏంటనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications