విజయమ్మతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మైండ్‌గేమ్: నారాయణ
హైదరాబాద్/చిత్తూరు: కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు సురేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన విజయమ్మతో భేటీ కావడం గమనార్హం. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన భేటీ అయ్యారు.
అక్రమ సంబంధమే: నారాయణ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సిపిఎం దోస్తీ ఓ అక్రమ సంబంధమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రెండు పార్టీల మధ్య రహస్య నిశ్చితార్థం జరిగిపోయిందని, ఇప్పటికే తాంబూలాలు పుచ్చుకొని అభిప్రాయ సేకరణ అంటూ ఓ మైండ్ గేమ్‌కు తెరదీశారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒకప్పుడు క్యూ కట్టిన నేతలు జగన్ బాగోతం తెలిశాక ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని, బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.
రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకుంటూ, జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో దోస్తీ కోసం ఎత్తుగడ వేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారం కోసం అన్ని పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబును వాడుకోవడానికి బిజెపి సిద్ధఫడిందన్నారు.












Click it and Unblock the Notifications