వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో ఆసక్తికరం: విభజనపై ఖర్గే నోటీసు, విజయసాయిపై వెంకయ్య ఆగ్రహం, సుజనకు అండ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సందర్ఫంగా కేంద్రాన్ని విభజన హామీలపై నిలదీశారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారన్నారు. హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. రైల్వే జోన్ అంశం ఏమయిందని అడిగారు.

Recommended Video

YCP MP Vijay Sai Reddy Speaks On AP Special Status in Rajya Sabha

మోడీ ప్రసంగంలో ఏమీలేదు, తెలంగాణకు ఎలా ఇస్తారు: కేంద్రంపై బాబు ఆగ్రహంమోడీ ప్రసంగంలో ఏమీలేదు, తెలంగాణకు ఎలా ఇస్తారు: కేంద్రంపై బాబు ఆగ్రహం

విభజన హామీలపై కేవీపీ

విభజన హామీలపై కేవీపీ

విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై మంత్రి స్పందిస్తారని అధికార పార్టీ తెలిపింది. కేవీపీ మాట్లాడుతూ విభజన చట్టాలు అమలు చేయాలన్నారు. లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. వెంటనే విభజన హామీలు అమలు చేయాలన్నారు.

మల్లికార్జున ఖర్గే నోటీసులు

మల్లికార్జున ఖర్గే నోటీసులు

సభ్యుల సూచననే మనం పాటించకుంటే ఎలా అని కేవీపీ ప్రశ్నించారు. గత కేంద్ర ప్రభుత్వం లేదా సభ చేసిన చట్టాలను అమలు చేసేలా ఆదేశించాలని ఆయన రాజ్యసభకు సూచించారు. మరోవైపు ఏపీ విభజన - హామీలు - హోదాపై కాంగ్రెస్ లోకసభలో నోటీసు ఇచ్చింది. లోకసభ జనరల్ సెక్రటరీకి ఈ మేరకు మల్లికార్జున ఖర్గే నోటీసులు ఇచ్చారు. 184 కింద చర్చ ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా లోకసభలో టీడీపీ ఎంపీల నిరసనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సుజనను తప్పుబట్టిన విజయసాయి, వెంకయ్య అండ

సుజనను తప్పుబట్టిన విజయసాయి, వెంకయ్య అండ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ... సుజనా చౌదరి మంత్రివర్గంలో ఉంటూ విభజన హామీలపై ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. ఆర్టికల్ 74 ప్రకారం తాను మాట్లాడుతున్నానని చెప్పారు. అయితే వెంకయ్య ఆయనను అడ్డుకున్నారు. బడ్జెట్ పైనే మాట్లాడాలన్నారు. విజయసాయిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుచూ సభను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు.

తప్పులేదని వెంకయ్య నాయుడు

తప్పులేదని వెంకయ్య నాయుడు

సుజనా చౌదరి రాజ్యసభలో మాట్లాడటంపై విజయసాయి ప్రశ్నించడంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని చెప్పారు. మంత్రి సుజన నిరసన తెలపలేదన్నారు. సలహా మాత్రమే ఇచ్చారని చెప్పారు. రాజ్యసభలో ఎంపీలు నిరసన చెబుతుండటంతో వెంకయ్య పదేపదే కూర్చోమని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయదా వేశారు.

English summary
Congress notice on Andhra Pradesh division for debate in Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X