ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే: నగరి, గుడివాడల్లో టఫ్: మాజీ వైసీపీ నేతలకు టికెట్లు

AP Congress 1st list: రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మొత్తం 114 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే వారిని ప్రకటించింది.

అలాగే- అయిదు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాకినాడ- పల్లంరాజు, రాజమండ్రి గిడుగు రుద్రరాజు, బాపట్ల (ఎస్సీ రిజర్వుడ్)- జేడీ శీలం, కర్నూలు- పీజీ రామ్‌ పుల్లయ్య యాదవ్, కడప- వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయబోతోన్నారు ఎన్నికల్లో.

Congress releases a list of 114 candidates for the Andhra Pradesh Assembly elections 2024

అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రలు ఇలాకాలను టార్గెట్‌గా చేసుకున్నట్లు కనిపించింది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన కొందరు మాజీ ఎమ్మెల్యేలకూ ఈ జాబితాలో చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తొగురు అర్థర్‌కు అదే నియోజకవర్గం టికెట్ ఇచ్చింది కాంగ్రెస్.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ఛైర్మన్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఎన్నికల బరిలో దిగారు. తన సొంత నియోజకవర్గం శింగనమల నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది. బద్వేలు- నీరుగుంట దొర విజయ జ్యోతి, రైల్వే కోడూరు- గోసాల శ్రీదేవి, రాయచోటి- షేక్ అల్లా బక్ష్ పోటీలో నిలిచారు.

నంద్యాల- గోకుల కృష్ణారెడ్డి, తాడిపత్రి- గుజ్జల నాగిరడ్డి, రాప్తాడు- ఆది ఆంధ్రా శంకరయ్య, కోడూమూరు- పరిగెళ్ల మురళీకృష్ణ, రాయదుర్గం- ఎంబీ చిన్న అప్పయ్య, ఉరవకొండ- వై మధుసూదన్ రెడ్డి, గుంతకల్లు- కావలి ప్రభాకర్, హిందూపురం- వీ నాగరాజు, పుట్టపర్తి- మధుసూదన్ రెడ్డి, పీలేరు- బీ సోమశేఖర్ రెడ్డి, చిత్తూరు- జీ టికారాం, కుప్పం- ఆవుల గోవిందరాజులు పోటీలో ఉన్నారు.

మంత్రులు ఆర్ కే రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. నగరి టికెట్‌ను పోచంరెడ్డి రాకేష్ రెడ్డికి ఇచ్చింది. రెడ్డి సామాజిక వర్గం ఓటుబ్యాంకు చీలుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మాదేపల్లి సత్యానందరావును బరిలో దింపింది.

గుడివాడలో వడ్డాది గోవిందరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా.. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. దొరబాబుకు కాంగ్రెస్ టికెట్ లభించింది. గుంటూరు ఈస్ట్ బరిలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+