తెలంగాణలో స్టార్ కాంపెయిన్: అజార్, నగ్మా..(పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం దృఢంగా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతోపాటు ప్రజలకు సుపరిచితులైన నాయకులతో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. కాగా, తెలంగాణ పిసిసి తమ ఎన్నికల ప్రచారవ్యూహాలపై దృష్టి సారించకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రచారం ఈ విధంగా నత్తనడకన కొనసాగితే రాష్ట్రం ఇచ్చిన ఫలితం ఉండదని ఆందోళన చెందుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 16న కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో సోనియా పాల్గొనబోతున్నారు. ఆ మరునాడు (17న) వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అది 21కి వాయిదాపడింది.
విస్తృత ప్రచారం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ప్రధాని మన్మోహన్‌తోపాటు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్, సినీ నటి నగ్మాను కూడా తెలంగాణలో ప్రచారానికి దింపాలని నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా ఏప్రిల్ 30న పోలింగ్‌లోగా వీలైనన్ని ఎక్కువ సభలు వీరితో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం 40 మంది 'స్టార్ కాంపెయినర్ల'ను గుర్తించింది.
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్, పరిశీలకుడు కుంతియా, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వయలార్ రవి, గులాం నబీ ఆజాద్, జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యానిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ సారథి దామోదర రాజనరసింహ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, డికె అరుణ, జి. చిన్నారెడ్డి, ఫరీదుద్దీన్, ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్‌లను ప్రచారం కోసం సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా వీరితోపాటు పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, బిహెచ్ క్రాంతి, ప్రేమ్‌లాల్, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, వి.హనుమంతరావు, ఎం.ఎ.ఖాన్, రేణుకా చౌదరి, టి ప్రచార కమిటీ కో-చైర్మన్ షబ్బీర్ అలీ, పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సిరాజుద్దీన్, ఎస్సీ సెల్ చైర్మన్ కృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్‌లాల్ నాయక్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలను నియమించింది. ఏప్రిల్ 30 ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం వీరందరికి సూచించింది.

ఏప్రిల్ 16న సోనియా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రాచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 16న కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో సోనియా పాల్గొని ప్రసంగిస్తారు.

ఏప్రిల్ 21న రాహుల్ గాంధీ
సోనియా గాంధీ పర్యటన మరుసటి రోజు (ఏప్రిల్ 17న) వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు భావించారు. అయితే అది 21కి వాయిదాపడింది.

నిన్నటి తరం నాయిక నగ్మా
టాలీవుడ్ కథానాయికగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ నటి నగ్మా కూడా తెలంగాణలో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో తన ప్రచారాన్ని విస్తృతం చేయడం కోసమే అజహారుద్దీన్, నగ్మా లాంటి ప్రజలకు సుపరిచితులైన వ్యక్తులను ప్రచారంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

స్థానిక నాయకత్వం
తెలంగాణ తెచ్చింది.. ఇచ్చింది తామేనని తమకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునివ్వాలని స్థానిక నాయకత్వానికి అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యానిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ సారథి దామోదర రాజనరసింహ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు.

మాజీ క్రికెటర్ అజహారుద్దీన్
హైదరాబాద్ నగరానికి చెందిన క్రికెట్ ఆటగాడు, మాజీ టీమిండియా కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications