రిసల్ట్స్: వెలవెలబోయిన గాంధీ, ఇందిరా భవన్(పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయాలు మూగబోయాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ శుక్రవారం ఎలాంటి సందడి లేకుండా వెలవెలబోయాయి. కార్యకర్తలు గానీ, నాయకులు గానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలయ వద్ద కానరాలేదు.
కాగా, శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరాసావహిస్తామని చెప్పారు. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 20 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తిగా తనదే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. తమ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని చెప్పారు. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, సీమాంధ్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. కాగా, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ గానీ, పార్లమెంటు స్థానాన్ని గానీ గెలవలేకపోయింది.

పొన్నా లక్ష్మయ్య
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు.

వెలవెలబోయిన గాంధీభవన్
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయాలు మూగబోయాయి.

రఘువీరా రెడ్డి
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తిగా తనదే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. తమ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని చెప్పారు.

ఖాళీగా గాంధీభవన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ శుక్రవారం ఎలాంటి సందడి లేకుండా వెలవెలబోయాయి.

సందడి లేని ఇందిరాభవన్
తమ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని రఘువీరా చెప్పారు. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, సీమాంధ్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

నిర్మానుష్యంగా ఇందిరాభవన్
నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, సీమాంధ్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications