వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజం విత్ శివాజీ, పోలవరం తరలించేందుకు కేసీఆర్,మోడీ కుట్రలు,సిని నటుడు శివాజీ

|
Google Oneindia TeluguNews

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు ముదిరి పాకనా పడ్డాయి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నావేళ.సిని నటుడు శివాజీ మరోసారి తెరపైకి వచ్చాడు. ఎన్నికల నేపథ్యంలోనే పోలవం ప్రాజెక్టు తోపాటు రాజధానిని తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ 'నిజం విత్ శివాజీ ' పేరుతో సిని నటుడు శివాజీ విజయవాడలోని ఓ వీడియో ప్రదర్శించారు.

<strong>ఓట్ల పండుగ‌: తెలంగాణ నుండి ఏపికి ప‌ది ల‌క్ష‌ల మంది : మూడు వేల బ‌స్సులు : ప‌్ర‌తీ ఓటు కోసం పాట్లు..!</strong>ఓట్ల పండుగ‌: తెలంగాణ నుండి ఏపికి ప‌ది ల‌క్ష‌ల మంది : మూడు వేల బ‌స్సులు : ప‌్ర‌తీ ఓటు కోసం పాట్లు..!

నరేంద్రమోడీ, కేసీఆర్ లు పోలవరం ఆపేందుకు కుట్రలు చేస్తున్నారు

నరేంద్రమోడీ, కేసీఆర్ లు పోలవరం ఆపేందుకు కుట్రలు చేస్తున్నారు

దేశ ప్రధాని నరేంద్ర మోడి, తెలంగాణ సీఎం కేసీఆర్ పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని మరోసారి నటుడు శివాజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు అనుకూల ప్రభుత్వం రాకపోతే సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ప్రాజెక్టను ఆపేస్తారని అన్నారు. ఈనేపథ్యంలోనే కేసీఆర్ తో దోస్తానా చేయడం మంచిది కాదని, ఆయన నిజస్వరూపం తేలియదని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు,కాగా ఆయన తో స్నేహం చేయడం చేయడం పులిమీద స్వారీ చేయడమే అని తెలిపారు.మరోవైపు రాజధాని సైతం తరలిపోయో ప్రమాదం ఉందని ప్రజలను హెచ్చరించారు.నేడు ఉదయం వియయవాడలోని 'నిజం విత్ శివాజీ ' పేరిట విజయవాడలోని ఆయన ఓ విడీయో ను చూపించారు.ఈనేపథ్యంలోనే తాను రాజకీయ పార్టీల తరపున కాకుండా ఆంధ్రప్రదేశే ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నారు,

పోలవరం గ్రాఫిక్స్ కాదు

పోలవరం గ్రాఫిక్స్ కాదు

పోలవరం ప్రాజెక్టు పై తాను తీసిన వీడియోను ఆయన ప్రదర్శించడంతోపాటు 2021 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యె అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా ప్రాజెక్టు నిర్మాణం కోసం పనులు శరవేగంగా జరుగుతుంటే అది పూర్తిగా గ్రాఫిక్స్ కోట్టిపారేయడాన్ని ఆయన తప్పుబట్టారు.నిర్మాణ పనులను గ్రాఫిక్స్ అనడం విడ్డూరంటా ఉందని అన్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పోలవరం ప్రాజెక్టును తప్పకుండా అడ్డుకుంటారని తేల్చి చెప్పిన శివాజీ ,ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యల వీడియో ఆయన ప్రదర్శించారు. దీంతో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోని ఓటు వేయాలని కోరారు. 70 శాతం పూర్తైన ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

జగన్ ఇంటికి మూడేళ్లు పడితే రాజధానికి ఎన్నేళ్లు పడుతుంది.

జగన్ ఇంటికి మూడేళ్లు పడితే రాజధానికి ఎన్నేళ్లు పడుతుంది.

కాగా శివాజి రాజధాని పై ఓ వీడియోను ప్రదర్శించారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన వీడియో లో తెలిపారు.కాగా టీడీపీ గనుక అధికారంలోకి రాకపోతే రాజధాని సైతం తరలిపోయో అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. జగన్ నిర్మించుకున్న ఇంటికే మూడున్నరేళ్లు పడితే అతిపెద్ద రాజధాని నిర్మాణానికి సమయం పట్టదా అంటూ ప్రశ్నించారు. కాగా దీనిపై వచ్చిన వార్తలను నమ్మవద్దని సూచించారు.

 చంద్రబాబు ప్రభుత్వంలోను అవినీతీ

చంద్రబాబు ప్రభుత్వంలోను అవినీతీ

కాగా దేశంలోని అన్ని ప్రభుత్వాల్లో ఉన్నట్టు చంద్రబాబు ప్రభుత్వంలోను అవీనితి ఉందని అన్నారు.అయితే దీనిపై ప్రశ్నిస్తే తనకు కులపిచ్చి అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Film actor Shivaji has said that conspiracy is going on to stop Polavaram project and the capital also shifting ,he warned If, in favor of the KCR government in andrapradesh,In the name of 'Nizam with Shivaji', some videos were shown on the capital, Polavaram at vijayawada spoke to the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X