ఎర్రచందనం గోదాం వద్ద కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
తిరుపతి: తిరుపతిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడు కానిస్టేబుల్ నుదిటిపై బుల్లెట్ గాయం, మెడ కోసిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. మరణించిన కానిస్టేబుల్ సంతోష్ కుమార్‌ను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు.
సంతోష్ కుమార్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ అని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎర్రచందనం గోదావం వద్ద సంతోష్ కుమార్ కాపలాగా ఉన్నాడు. రాత్రి కాపలా సమయంలోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు.

సంతోష్ కుమార్ 9వ బెటాలియన్‌కు చెందిననాడు. తొటి సిబ్బంది తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించే లోగానే సంతోష్ కుమార్ మృతి చెందాడు.












Click it and Unblock the Notifications