ఎస్పీ ఆఫీసులో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
కడప: జిల్లా పోలీసు కార్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన వెంకటకిరణ్(28) 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వహిస్తున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి తన 303 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న డీఎస్పీ మాసూమ్ భాషా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.












Click it and Unblock the Notifications