నల్గొండలో వ్యక్తికి లేడీ కండక్టర్ చెప్పుదెబ్బ: సిటీలో రేప్‌చేసి బెదిరింపు

నల్గొండ/ఒంగోలు: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ మహిళా కండక్టర్, స్థానికులు అకతాయి యువకుడికి చెప్పుదెబ్బలతో బుద్ది చెప్పారు. నల్గొండ పట్టణంలో గత రెండు మూడు రోజులుగా ఓ యువకుడు బస్టాండులో ఉంటూ కండక్టర్‌ను టీజ్ చేస్తున్నాడు.

దీనిని భరించలేక ఆ కండక్టర్ సోమవారం నాడు అతనికి బుద్ధి చెప్పేందుకు నిర్ణయించుకుంది. అతనిని చెప్పుతో కొట్టారు. మహిళలకు వేధింపుల పైన విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం జిల్లా కురిచేడులో దారుణం జరిగింది. ఓ పదో విద్యార్థిని పైన అత్యాచారం జరిగింది. అత్యాచారానికి పాల్పడ్డది పాఠశాల కరస్పాండెంట్. విద్యార్థిని పైన ఇటీవలే అతను అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Contractor booked for raping woman

మహిళపై దారుణం

మహిళ పైన అత్యాచారం కేసులో పోలీసులు ఓ కాంట్రాక్టర్ పైన కేసు నమోదు చేశారు. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. 37ఏళ్ల మహిళ కాంట్రాక్టర్ వద్ద లేబర్‌గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో అతను అడ్వంటేజ్ తీసుకొని, ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం.

అతను ఓసారి ఆమె ఇంటికి వెళ్లి లైంగికంగా వేధించాడు. దాంతో అప్పటి నుండి ఆమె అతనికి దూరంగా ఉంటోంది. తాను చెప్పినట్లు వినకుంటే భర్తను చంపేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు దొంగల అరెస్ట్‌

హైదరాబాదులో ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 23 తులాల బంగారు అభరణాలు, రూ.2.6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+