బాబుకు ఇక ఆటంకాలు!: రాజధాని శంకుస్థాపనపై వివాదం, సీఎంకు గుడి.. వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుక పైన వివాదం రాజుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం సరైనది కాదని సంస్కృత లెక్చరర్ అయిన పురుషోత్తం చెబుతున్నారని మంగళవారం నాడు వార్తలు వచ్చాయి.
ఈ నెల 22వ తేదీన మకర లగ్నంలో 12.35 నుంచి 12.45 నిమిషాల మధ్య రాజధాని శంకుస్థాపన చేస్తే.. అమరావతి నిర్మాణానికి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారని తెలుస్తోంది. అంతకు గంట ముందు కొంత మేలుగా ఉందని చెప్పారని అంటున్నారు.
చంద్రబాబు గుడికి స్థలం ఎంపిక

టిడిపి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గుడి కట్టేందుకు తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన రైతు సతీష్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుకు గుడిపై తాను చేసిన ప్రకటనకు కట్టుబడ్డ సతీశ్... సోమవారం ఓ వాస్తు సిద్ధాంతితో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
గోదావరి నది తీరాన పుష్కర ఘాట్ సమీపంలోని సతీశ్ స్థలాన్ని వాస్తు సిద్ధాంతి ఖరారు చేశారు. ఏపీ రాజధానికి శంకుస్థాపన రోజుననే చంద్రబాబు గుడి నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలని సతీశ్ తొలుత భావించారు. అయితే, అది సరికాదని వాస్తు సిద్ధాంతి వెంకటనారాయణ ఆయనను వారించారని తెలుస్తోంది.
టిడిపి మండలాధ్యక్షుడిపై కేసు
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన మండల అధ్యక్షుడి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిరంగిపురం మండలటిడిపి అధ్యక్షులు ప్రభాకర్ పైన కేసు నమోదయింది. ఓ భవనం విషయంలో దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ అతని పైన వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని మంగళవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications