ఆశ్రయమిచ్చిన వ్యక్తి భార్యపై కానిస్టేబుల్ రేప్ యత్నం
నల్గొండ/నెల్లూరు: ఎన్నికల విధులకు వచ్చిన నల్లగొండ జిల్లా త్రిపురారం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ తనకు ఆశ్రయమిచ్చిన వ్యక్తి బార్య పైనే అత్యాచారయత్నం చేశాడు. దుర్గారెడ్డి అనే కానిస్టేబుల్ దుగ్గేపల్లిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఓ ఆటోను అద్దెకు తీసుకుని పెట్రోలింగ్ చేస్తున్నాడు.

శనివారం అర్ధరాత్రి ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, అనంతరం అత్యాచారం జరిపాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన బంధువులకు తెలిపింది. దీంతో బాధితురాలు, ఆమె బంధువులు త్రిపురారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ విషయాన్ని తర్వాత చూద్దామని పోలీసులు వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో, ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. విధిలేని పరిస్థితుల్లో కానిస్టేబుల్ దుర్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications