విశాఖ రాజేష్ కుటుంబం ఆత్మహత్య: కామాంధులు వేధించారు: సౌమ్య సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్‌రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడితో రాసలీలలు, రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్న భర్త, ఏమైందంటే?

విశాఖపట్టణంలోని ఆరిలోవ ముస్తఫా కాలనీలో దేవిరెడ్డి రాజేష్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ప్రకాశం జిల్లా కనిగిరి చెంది రాజేష్ రెడ్డి కొంత కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఎలక్ట్రిషీయన్‌గా రాజేష్‌రెడ్డి పనిచేస్తున్నాడు.

మొదటి భర్త అనుమతితో లవర్‌తో వివాహం: పోలీసులకు ఫిర్యాదు, ఏమైందంటే?

రాజేష్‌రెడ్డికి భార్య సౌమ్య, పిల్లలు విష్ణు, జాహ్నవి ఉన్నారు. ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్న రాజేష్‌రెడ్డి గురువారం ఉదయం పనికి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం రాత్రి వారు నలుగురు చనిపోయారు.

మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, టెక్కీ నాగరాజు హత్య, కాల్ డేటా పట్టించింది

 బంధువులకు ఫోన్ చేసి రాజేష్ కుటుంబం ఆత్మహత్య

బంధువులకు ఫోన్ చేసి రాజేష్ కుటుంబం ఆత్మహత్య

గురువారం ఉదయం పూట యధావిధిగా రాజేష్ విధులకు వెళ్ళాడు. సాయంత్రం విధులను ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఏమైందో ఏమో కానీ నలుగురు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆత్మహత్య చేసుకొనే ముందు చెన్నైలో ఉన్న తమ బంధువులకు పోన్ చేసి సమాచారమిచ్చారు. చెన్నైలోని బంధువులు విశాఖ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే బంధువుల సమాచారం మేరకు విశాఖ పోలీసులు రాజేష్ రెడ్డి ఇంటికి చేరుకొనేసరికి వారు నలుగురు చనిపోయారు.

కామాంధులు వేధించారు

కామాంధులు వేధించారు

చాలామంది కామాంధులు తన చుట్టూ తిరిగారని సౌమ్య సూసైడ్ లేఖ రాసింది. నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.కామాంధుల వేధింపులు భరించలేకపోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కామాంధుల ఆగడాలను భరించే శక్తి తనకు లేదన్నారు.వారి ఆగడాలను తట్టుకునే శక్తి ఇక లేదని, బ్లాక్ మెయిల్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.

పిల్లలను అందుకే చంపాం

పిల్లలను అందుకే చంపాం

ఎన్నో విషయాలు చెప్పాలని తనకు ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆ విషయాలను చెప్పలేకపోతున్నట్టు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తరువాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా చంపాల్సి వచ్చిందని సూసైడ్ నోట్ లో రాసింది.

కామాంధుల నుండి జాగ్రత్త

కామాంధుల నుండి జాగ్రత్త

తమ బంధువుల పిల్లలైన ప్రియ, పవిత్రలకు ఆ లేఖలో సౌమ్య జాగ్రత్తలు చెప్పింది. చాలా మంది కామాంధులు ఉన్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోట్ ను విశ్లేషిస్తున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four members of a family, including two children, allegedly committed suicide at Arilova on Thursday evening in vizag.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి