ఏపీలో కరోనా: తొలిసారి 2లక్షల యాక్టివ్ కేసలు -నిన్న89మంది మృతి, కొత్తగా 22,399 కేసులు -తూర్పులో ఉధృతి
కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో దక్షణాదిలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలతో పోటీపడుతూ ఆంధ్రప్రదేశ్ లోనూ వైరస్ విలయం కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. చరిత్రలో తొలిసారి ఏపీలో యాక్టివ్ కేసులు 2లక్షల మార్కును దాటాయి. ఐదు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరగా, తూర్పుగోదావరిలో మళ్లీ హాహాకారాలు మొదలయ్యాయి..

కొత్తగా 22,399 కేసులు
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 96,446 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 22,399 మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,66,785కు పెరిగింది. తొలి వేవ్ లో తీవ్ర తాకిడి ఎదుర్కొన్న తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి కూడా వైరస్ విజృంభిస్తున్నది. అక్కడ కొత్తగా అత్యధికంగా 3372 కేసులు వచ్చాయి. చిత్తూరులో 2646, గుంటూరు 2141, అనంతపురం 2080, విశాఖపట్నం జిల్లాలో 2064 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక

భారీగా మరణాలు..
ఏపీలో కొత్త కేసులతోపాటు కొవిడ్ మరణాలూ పెరిగాయి. నిన్న ఒక్కరోజే 89 మంది మృతి చెందారు. దీంతో మెత్తం మరణాల సంఖ్య 9,077కి చేరింది. గత 24 గంటల్లో విశాఖపట్నంలో 11 మంది, విజయనగరంలో 11 మంది, చిత్తూరులో తొమ్మిది మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, కృష్ణలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు కరోనాతో మరణించారు.

తారాస్థాయికి యాక్టివ్ కేసులు..
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 18,638 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 11,56,666కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ పుట్టుకొచ్చిన ఏడాదిన్నర కాలంలో ఏపీలో యాక్టివ్ కేసులు 2లక్షలకుపైగా చేరడం ఇదే తొలిసారి. ఏపీలో అంతా కలిపి ఇప్పటిదాకా 1,77,02,133 శాంపిళ్లను పరీక్షించారు.












Click it and Unblock the Notifications