ఏపీలో కరోనా: మళ్లీ 1000 దాటిన యాక్టివ్ కేసులు -కొత్తగా 74 కేసులు, ఇద్దరి మృతి -చిత్తూరులో భారీగా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా జెడలు విప్పుతోంది. గడిచిన రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన యాక్టివ్ కేసులు మళ్లీ 1000 మార్కును దాటేశాయి. చిత్తూరు జిల్లాలో మరోసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి..

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 25,907 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... వారిలో 74 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,766కు పెరిగింది. కోవిడ్ వల్ల నిన్న ఒక్కరోజే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,176కి చేరుకుంది.

COVID-19 in ap: 74 new cases, 2 deaths in last 24 hrs, active cases again go past 1,000 mark

నిన్న ఒక్కరోజే వివిధ ఆస్రత్రుల నుంచి 61 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా రాష్ట్రంలో రికవరీల సంఖ్య 8,82,581కి చేరింది. కాగా, చాలా రోజులుగా తగ్గుతూ వచ్చిన యాక్టివ్ కేసులు ఇవాళ్టితో మళ్లీ వెయ్యి మార్కును దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1006గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 29 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 13, కృష్ణా 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 5, కడప 5, గుంటూరు 2, నెల్లూరు 2, విశాఖపట్నం 2, ప్రకాశం జిల్లాలో కొత్తగా ఒక కేసు నమోదుకాగా, అనంతపురం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్క కేసు కూడా రాలేదు. ఇప్పటి వరకు ఏపీలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 1,42,62,086కి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+