విజయవాడ ఎయిర్‌పోర్టులో నేటి నుంచి కఠిన ఆంక్షలు..కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
ఏపీలో కరోనా కేసుల కల్లోలం పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 19 వేల కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రేపటి నుంచి ఉదయం పూట కర్ఫ్యూ అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో దేశీయ, విదేశీ విమాన ప్రయాణికుల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం విజయవాడ ఎయిర్‌పోర్టులో నేట నుంచి కఠిన ఆంక్షలకు సిద్ధమైంది.
ఇవాళ్టి నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్‌కు మాత్రమే అనుమతి ఇస్తారు. వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్దే ఆపేస్తారు. దీంతో అనవసర కోవిడ్ వ్యాప్తి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కోవిడ్ పరీక్షలను కూడా ముమ్మరం చేయబోతున్నారు. వీటి ద్వారా కోవిడ్ వ్యాప్తిని సాధ్యమైనంత మేర తగ్గించాలని భావిస్తున్నారు.

Recommended Video
విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమ ఇప్పటివరకూ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇప్పటి నుంచి దేశీయ ప్రయాణికులకు కూడా టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో పాజిటివ్‌గా తేలితే వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలిస్తారు. అక్కడ 14 రోజులు ఉంచిన తర్వాత కోవిడ్ తగ్గినట్లు తేలాకే ఇళ్లకు పంపుతారు. ఇందుకోసం స్ధానిక ఆస్పత్రులను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ పరీక్షలకు సిద్ధమైన ప్రయాణికులు మాత్రమే ఇకపై విమాన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది..












Click it and Unblock the Notifications