వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే చెప్పేశాం: బాబుకు పవన్ సహా ఆ ముగ్గురు షాక్, 'ఒత్తిళ్లకు లొంగారు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదాపై మా ఉద్యమం మేం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో గతంలోనే చెప్పామని, ఇప్పుడు మరోసారి అఖిల పక్ష భేటీకి వెళ్లమని సీపీఎం నేత మధు శుక్రవారం చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పవన్ కళ్యాణ్, సీపీఐ, సీపీఎంలు పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.

పవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగింది, ఆ ద్రోహం చేయవద్దు: ఉండవల్లిపవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగింది, ఆ ద్రోహం చేయవద్దు: ఉండవల్లి

ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి ఎంత పాపం ఉందో టీడీపీకి అంతే ఉందన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం చర్చకు రాకుండా కుట్ర చేస్తోందన్నారు. పార్లమెంటులో సాధ్యం కాకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు.

మళ్లీ వెళ్లడం లేదు

మళ్లీ వెళ్లడం లేదు

రెండోసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీడీపీ చెప్పిందని, కానీ తాము వెళ్లడం లేదని మధు స్పష్టం చేశారు. తమ వైఖరిని ఓసారి చెప్పాక మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. హోదా కోసం తాము పవన్ కళ్యాణ్, సీపీఐతో కలిసి ముందుకు సాగుతామన్నారు.

 బాబు జపాన్ తరహా ఉద్యమానికి కౌంటర్

బాబు జపాన్ తరహా ఉద్యమానికి కౌంటర్

సీపీఎం రామకృష్ణ మాట్లాడుతూ.. పార్లమెంటులో చేసిన చట్టాలకే విలువ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలు అన్ని అమలు చేయాలన్నారు. చంద్రబాబు పదేపదే జపాన్ తరహా ఉద్యమం అంటున్నారని, ఏపీలో జపాన్ తరహా ఏమిటన్నారు. జపాన్‌లో ఉన్నామా లేక సింగపూర్ ఉన్నామా అని ప్రశ్నించారు. ఏపీలో ఏపీ తరహా ఉద్యమం కావాలన్నారు.

ఈ దుర్గతి పట్టేది కాదు

ఈ దుర్గతి పట్టేది కాదు

ప్రత్యేక హోదా విషయంలో తమకు చంద్రబాబు వద్ద చిత్తశుద్ధి కనిపించలేదని రామకృష్ణ అన్నారు. విపక్షాల నిరసనలు డ్రామాలు అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ.. డ్రామాలో ఏమిటో వాటిని తేలుస్తామన్నారు. చంద్రబాబు ప్రజల్లోని ఆగ్రహం గుర్తించాక యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబు అప్పుడే ప్రత్యేక హోదా అంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదన్నారు.

 ఒత్తిళ్లకు లొంగారు

ఒత్తిళ్లకు లొంగారు

అంతకుముందు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొత్త రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం ఉపయోగం లేదన్నారు. కాఫీ, టీల కోసం అఖిల పక్షానికి వెళ్లవలసిన అవసరం లేదన్నారు. అఖిల పక్షంతో ఏదో జరుగుతుందని తాము భావించడం లేదన్నారు. వ్యక్తిగత లాభం కోసం హోదా అంశాన్ని పక్కన పెట్టారన్నారు. హోదాని టీడీపీ, వైసీపీలు ముందుకు తీసుకెళ్లలేకపోయాయని, ఇప్పుడు మేం తీసుకెళ్తామన్నారు. వారు ఒత్తిళ్లకు లొంగారన్నారు. కాగా, అఖిల పక్ష సమావేశానికి వైసీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు దూరం ఉంటున్నాయి.

English summary
CPI, CPI and Jana Sena will not attend to All party meeting on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X